04-08-2025 01:56:59 AM
నకిలీ ఫోన్ కాల్‌గా గుర్తింపు
నాగ్‌పూర్, ఆగస్టు 3: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్ నివాసంలో బాంబు పెట్టినట్టు ఆదివారం ఓ అపరిచిత వ్యక్తి పోలీసులకు కాల్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్‌స్కాడ్ సా యంతో గాలింపు చర్యలు చేపట్టగా.. ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదు.
ఫో న్ నంబర్ ఆధారంగా గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నాగ్‌పూర్ తులసి బాగ్ రోడ్‌లోని ఓ మద్యం దు కాణంలో పని చేసే ఉమేష్ విష్ణు రౌత్ నకిలీ బెదిరింపు కాల్ చేసినట్టు తేల్చారు. అనంత రం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బెదిరింపు కాల్ ఎందుకు చేశాడనే కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.