calender_icon.png 4 August, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు మెడికల్ సహాయం – రాజలక్ష్మి కృషికి ఫలితం

03-08-2025 11:49:33 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు సీఎం  రూపంలో భరోసా బేగంపేటలో మెడికల్ రీయింబర్స్‌మెంట్ సహాయం మంజూరు – కార్పొరేటర్ అభ్యర్థి రాజలక్ష్మి గారి కృషికి ఫలితం. బేగంపేట డివిజన్ పరిధిలో పలు సామాన్య కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో, వారి ఆసుపత్రి ఖర్చులకు ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మెడికల్ రీయింబర్స్‌మెంట్ మంజూరు కావడం జరిగింది. బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి  రాజలక్ష్మి ఆనంద్. నిరంతర ప్రయత్నాల ఫలితంగా ఈ సహాయం సాధ్యపడింది.

ఈ నేపథ్యంలో క్రింద పేర్కొన్న లబ్ధిదారులకు నిర్ణీత మొత్తాలు మంజూరయ్యాయి:

 ఎ. వజ్రవ్వ (బ్రాహ్మణవాడి) – ₹13,500/-

 కె. శిరీష (శ్యామ్‌లాల్ బిల్డింగ్) – ₹18,000/-

 అనసూయ (శ్యామ్‌లాల్ బిల్డింగ్) – ₹18,500/-

కృష్ణ (శ్యామ్‌లాల్ బిల్డింగ్) – ₹34,500/-

ఎ. నరేష్ (భగవంత్‌పూర్) – ₹9,000/-

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నెమలి ఆనంద్ (నందు), మైసూరు మధుసూధన్, బేగంపేట డివిజన్ బీజేపీ అధ్యక్షుడు మహేష్, ప్రధాన కార్యదర్శి టి. శ్రవణ్, ప్రమోద్, మైనారిటీ మోర్చా నాయకుడు యాకూబ్ పాల్గొని లబ్ధిదారులను అభినందించారు. ఈ సందర్భంగా రాజలక్ష్మి ఆనంద్ మాట్లాడుతూ “ప్రతి పేద కుటుంబానికి ఆరోగ్యం మీద ఖర్చు పెద్ద భారం.

ఈ సహాయం వల్ల వారికి కొంత భరోసా లభించిందని అనిపిస్తుంది. ప్రభుత్వ పథకాలను అవసరమైన వారికి అందించాలన్నదే నా లక్ష్యం. నేను ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం, ప్రజలకు సేవ చేయడంలో ముందుండబోతున్నాని తెలిపారు. అంతేకాదు, మరో అనేక మంది పేద, మధ్యతరగతి వర్గాలకు కూడా అవసరమైన సహాయాన్ని అందించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు.