04-08-2025 12:31:18 AM
పేరుకే వెల్ నెస్ సెంటర్..పట్టించుకునే వారే లేరు
అధికారులు తనిఖీ చేసినా ఫలితం శూన్యం..
కలెక్టర్ గారు మీరైనా పట్టించుకోండి : పెన్షనర్లు, వృద్ధులు, జర్నలిస్టుల ఆవేదన
మహబూబ్ నగర్ ఆగస్టు 3 (విజయ క్రాంతి) : ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు , జ ర్నలిస్టుల కోసం గత ప్రభుత్వం ప్రత్యేకంగా సెంటర్లను ఏర్పాటు చేసింది. అయితే వెల్ నెస్ సెంటర్ల ఉద్దేశం మాత్రం ఎక్కడా నెరవేయడం లేదు. పేరుకే ఆరోగ్య కేంద్రాలు ఉ న్నాయి కానీ అక్కడ డాక్టర్లు ఉండరు మం దులు అసలే ఉండవు. ఇప్పటికే పలుమార్లు సోషల్ మీడియాలో వివిధ పత్రికల్లో కథనా లు వచ్చిన అధికారుల్లో మాత్రం స్పందన లే దు.
ముఖ్యంగా పెన్షనర్లు జర్నలిస్టులు ఎక్కు వ శాతం డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. వారు బయట మందులు కొన లేని పరిస్థితి ఉన్నది. వెళ్లే సెంటర్లో కనీసం జ్వరం గోలి కూడా ఈరోజు దొరకని పరిస్థితి నెలకొంది అంటే వైద్యం జిల్లాలో ఏ విధంగా ఉందో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి వెళ్లే సెంటర్ పై దృష్టి ఉంచాలని పెన్షనర్లు ఉద్యోగులు జర్నలిస్టులు కోరుతున్నారు.
మార్పు రాలే..
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పాత డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మొన్నటిదా కా వెల్నెస్ సెంటర్ కొనసాగింది. ప్రస్తుతం సెంటర్‌ను మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోకి మార్చారు. పాత డీ ఎంహెచ్‌ఓ కార్యాలయంలో రెండవ అంతస్తులో వెల్నెస్ సెంటర్ ని కొనసాగించారు.
పెన్షనర్లు చాలావరకు వృద్ధులు జర్నలిస్టు లు కూడా 55 - 60ఏళ్లు పైబడిన వారు ఉం డడంతో కలెక్టర్ విజయేంద్ర బో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పెన్షనర్ల వినతి మేరకు మహబూబ్నగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలోకి మార్చా రు. ఇంతవరకు బాగానే ఉన్నా సుమారు నెలరోజులు గడుస్తున్న కనీసం జ్వరం గోలి కూడా దొరకని పరిస్థితిలో వెన్న సెంటర్ ఉం ది అంటే వైద్యం ఎంత దయనీయంగా మా రిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
వెల్నెస్ సెంటర్ కు ఇన్చార్జి ఉన్నా కనీసం పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ ఏ విషయం గురించి అడి గినా కూడా ఉన్నతాధికారులకు నివేదించాం లెటర్ పంపించాం అని చెప్పడం తప్ప ఎ లాంటి చర్యలు తీసుకోవడం లేదని పెన్షనర్లు ఆరోపిస్తున్నారు. డయాబెటిస్ రోగుల కు నెలకు సుమారు 1500 నుంచి 2500 వరకు మందుల బిల్లు అవుతుంది.
ప్ర భుత్వం పెన్షనర్లపై జర్నలిస్టులపై భారం ప డొద్దు అనే సదుద్దేశంతో వెల్నెస్ సెంటర్లో అ న్ని రకాల మందులను ఉంచేలా ఏర్పాటు చేసింది. అయితే గత కొంతకాలంగా మందుల నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. సుమారు నెలరోజులు గడుస్తున్న కనీసం జ్వరం గోలి పారాసిటమాల్ కూడా లేదు అంటే పర్యవేక్షణ లోపం ఇట్టే అర్థమవుతున్నది. ఇక యంత్రాల పరిస్థితి దేవుడెరుగు.
కనీసం మందు బిళ్ళలు ఇచ్చి నా సరే అంటూ పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. ఈసీజీ సేవలు నిలిచిపోయి ఎనిమిది నెలలు గడుస్తున్నా కనీసం పట్టించు కు న్న దాఖలాలు లేవు. మరి వెళ్లే సెంటరు ఎం దుకు నడుపుతున్నట్లు.. వాటి ఉద్దేశాలు ఎ క్కడ నెరవేడుతున్నట్లు ఉన్నత అధికారులు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది.
ఒక డెంటిస్ట్ తోనే సేవలు..
వెల్నెస్ సెంటర్ మొత్తం లో ఆదివారం కే వలం ఒకే ఒక డెంటిస్ట్ డాక్టర్ తో సేవలు అందించడం గమనార్హం. ఆదివారం మహబూబ్నగర్ వెళ్లే సెంటర్ కు 72 మందికి ఓపి సేవలందించారు. 72 మంది వివిధ రకాల సమస్యలతో వెల్నెస్ సెంటర్ కు వచ్చినప్పటికీ దవాఖానాలో కేవలం ఒకే డెంటిస్ట్ ఉండడంతో చేసేది ఏమీ లేక ఉన్న ఒకటి రెండు మందు బిల్లలు తీసుకుని వెన్ను దీరిగారు. వెల్నెస్ సెంటర్లో ఉన్న వైద్యులను వివరాలు అడగగా ఇంతకుముందే డాక్టర్ వెళ్లిపోయారని చెప్పారు.