04-08-2025 01:56:58 AM
-యూపీలోని గోండా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
-మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం
లక్నో, ఆగస్టు 3: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోం డా జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమా దం చోటు చేసుకుంది. సిహగావ్ గ్రామానికి చెందిన 15 మంది భక్తులు దైవదర్శనం కోసం బొలేరో వాహనంలో బయళ్దేరారు. మార్గమధ్యలో ఆ వాహనం అదుపుతప్పి స రయూ కాలువలోకి దూసుకెళ్లింది. ఖర్గుపూర్‌లోని పృథ్వీనాథ్ ఆలయానికి భక్తులు వె ళ్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది.
వా హనం కాలువలోకి దూసుకెళ్లడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమా చారం అందించారు. పోలీసులు వచ్చి సహాయక చర్యలు చేపట్టి.. నీటిలో మునిగిపో యిన మృతదేహాలను వెలికితీశారు. మృతిచెందిన వారిలో చిన్నరులు కూడా ఉన్నారు. ‘ఆలయానికి వెళ్తుంటే బొలేరో వాహనం కాలువలో పడి 11 మంది మరణించారు.
స్వల్పగాయాలతో బయటపడ్డ నలుగురిని రక్షించి జిల్లా ఆస్పత్రికి తరలించాం’ అని ఎస్పీ వినీత్ జైస్వాల్ తెలిపారు. ఈ ఘోర ప్ర మాదంపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సం తాపం తెలిపారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అం దించనున్నట్టు సీఎం యోగి తెలిపారు. అం తే కాకుండా ప్రధానమంత్రి జాతీయసహా యనిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున అందించనున్నట్టు పీఎంవో కార్యాలయం తెలిపింది. ప్ర మాదానికి గల కారణాలు ఏంటని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.