04-08-2025 01:54:39 AM
చెన్నై, ఆగస్టు 3: తమిళనాడులో 6.5 లక్ష ల మంది ఓటర్లు పెరిగారని కాంగ్రెస్ సీనియ ర్ నేత చిదంబరం ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ‘ఎస్‌ఐఆర్ వల్ల బీహార్‌లో 65 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. అదే సమయంలో తమిళనాడులో ఓటర్లు పెరిగారు.
ఇది ఆందోళనకర చర్య’ అని చిదంబరం పోస్టు చేశారు. తమిళనాడు ఓటర్లు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం లేకుండా చేయడానికే ఓటర్ల సంఖ్యను పెంచారని మండిపడ్డారు.
రాష్ట్రాల్లో ఎన్నికల విధానాలను మార్చేందుకు ఎన్నికల సం ఘం ప్రయత్నాలు చేస్తోందని.. ఈ కుట్రలను రాజకీయంగా, చట్టబద్ధంగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. తమిళనాడు ఓట రు జాబితాలో వలస కార్మికులను చేర్చడం పై అధికార డీఎంకే, పలు ప్రాంతీయ పార్టీలు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.