calender_icon.png 4 August, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తేజస్వీకి ఈసీ నోటీసులు

04-08-2025 01:55:29 AM

తేజస్వీ చూపిన కార్డు అప్పగించాలన్న ఎన్నికల సంఘం

పాట్నా, ఆగస్టు 3: బీహార్‌లో ముసాయి దా ఓటర్ల జాబితా రాజకీయ రగడకు కార ణం అయింది. ముసాయిదా ఓటర్ల జాబితా ను ప్రకటించిన తర్వాత జాబితాలో తన పేరు లేదని బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజ స్వీయాదవ్ ఆరోపించారు. విలేకరుల స మావేశం ఏర్పాటు చేసి ఓటరు కార్డును చూ పుతూ నంబర్ ఎంటర్ చేయగా ఫలితం కనిపించలేదు.

నా పేరు జాబితాలో లేకుండా చేశారు. ఎలా పోటీచేయాలన్నారు. తేజస్వీ యాదవ్ చేసిన ఈ ఆరోపణలపై ఈసీ స్పం దిస్తూ.. అవన్నీ తప్పుడు ఆరోపణలని ఖం డించింది. విలేకరుల సమావేశంలో తేజస్వీ యాదవ్ చూపిన ఓటరు కార్డును త మకు అప్పగించాలని ఎన్నికల సంఘం అధికారు లు లేఖ రాశారు.

ఆ కార్డు అధికారికంగా జా రీ చేసింది కాదని.. పూర్తిస్థాయి దర్యాప్తు కో సం ఆ కార్డును అప్పగించాలని లేఖలో కో రారు. తేజస్వీ వాదనలను జిల్లా కలెక్టర్ కూ డా తిరస్కరించారు. మరోపక్క తేజస్వీ ఆరోపణలపై బీహార్‌లోని ఎన్డీయే కూటమి మం డిపడుతోంది. కేసు నమోదు చేయాలని డి మాండ్ చేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.