MI vs CSK Preview: ముంబైకి డూ ఆర్ డై మ్యాచ్
చెన్నైతో కీలక మ్యాచ్
రోహిత్ ఆడటం డౌటే
చెన్నై, మే 1: ఐపీఎల్ 19వ సీజన్‌లో పేల వ ప్రదర్శనతో నిరాశ పరుస్తోన్న ముంబై ఇండియన్స్ ఇప్పుడు డూ ఆర్ డై మ్యాచ్‌కు సిద్ధమైంది. చెపాక్ స్టేడియం వేదికగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడబో తోంది. గత సీజన్ తరహాలోనే ఈ సారి కూడా ముంబై స్థాయికి తగినట్టు ఆడలేకపోతోంది. కీలక ఆటగాళ్ళంతా ఘోరంగా విఫల మవుతున్నారు.
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌కు ఇప్పుడు ప్రతి మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే ఈ మ్యాచ్ ముంబై భవిష్యత్తును నిర్ణయించేలా ఉంది. ప్లేఆఫ్స్ ఆశలు నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సిందే.
వరుస పరాజయాలతో ప్రస్తుతం ముంబై పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇప్పటి వరకూ 8 మ్యాచ్‌లలో కేవలం రెండే విజయాలు సా ధించిన ముంబై ప్లే ఆఫ్ రేసులో నిలవాలం టే మిగిలిన అన్ని మ్యాచ్‌లలో గెలవాల్సిందే. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై భారీస్కోరు చేసినా పరాజయం పాలైంది. దీంతో బౌలర్లు గాడిన పడితే తప్ప ముంబైకి విజయం దక్కే అవకాశాలు లేవు. అటు బ్యాటింగ్‌లో రికెల్టన్ సెంచరీతో ఫామ్ లోకి రాగా.. మిగిలిన వారిలో సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా నిరాశ పరుస్తున్నారు.
రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడడం కూడా అనుమానంగానే కనిపిస్తోంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ముంబై కంటే కాస్త మెరుగైన స్థితిలో ఉంది. ఆరంభంలో వరుస పరాజయాలతో సతమతమైన చెన్నై తర్వాత పుంజుకుంది. 8 మ్యాచ్ లలో మూడు విజయాలతో పాయింట్ల పట్టి కలో ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ పై గెలిచిన తర్వాత సన్ రైజర్స్ చేతిలో ఓడిన చెన్నై ముంబై ఇం డియన్స్‌ను ఓడించింది. అయితే గత మ్యాచ్ లో గుజరాత్ చేతిలో ఓడిపోయింది.
ఇప్పు డు ముంబైపై గెలిచి మళ్లీ గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. బ్యాటింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఫామ్‌లోకి రావడం సీఎస్కేకు అ డ్వాంటేజ్. సంజూ శాంసన్, బ్రెవిస్, శివ మ్ దూబే కూడా చెలరేగితే భారీస్కోరు సాధించే అవకాశముంటుంది. అటు బౌలింగ్‌లో ఓవర్టన్ నిలకడగా రాణిస్తున్నాడు. గత రికార్డుల పరంగా చూస్తే ముంబైదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 42 మ్యాచ్‌లలో తలపడితే ముం బై 22 సార్లు గెలిచింది. చెన్నై 20 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఇక మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న చెన్నై పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని అంచనా.
తుది జట్లు అంచనా
ముంబై ఇండియన్స్ : విల్ జాక్స్, రికెల్టన్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్థిక్ పాండ్యా, తిలక్ వర్మ, రూథర్‌ఫర్డ్, శాంట్నర్, అశ్వని కుమార్, బుమ్రా , ఘజన్‌ఫర్
చెన్నై సూపర్ కింగ్స్ : సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, బ్రెవిస్, దూబే, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, ఓవర్టన్, స్పెన్సర్ జాన్సన్ , అన్షుల్ కాంబోజ్
Match Overview
మ్యాచ్: ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్
వేదిక: చెపాక్ స్టేడియం, చెన్నై
పరిస్థితి: ముంబైకి డూ ఆర్ డై మ్యాచ్
రోహిత్ శర్మ: ఆడే అవకాశం అనుమానమే
Team Form Analysis
ముంబై ఇండియన్స్
ముంబై ఈ సీజన్‌లో తీవ్రంగా నిరాశపరుస్తోంది. 8 మ్యాచ్‌లలో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది.
👉 సమస్యలు:
- బౌలింగ్ స్థిరంగా లేదు
- కీలక బ్యాటర్లు ఫామ్‌లో లేరు
- ఒత్తిడిలో విఫలం
చెన్నై సూపర్ కింగ్స్
చెన్నై ప్రారంభంలో తడబడినా తర్వాత పుంజుకుంది. ప్రస్తుతం 3 విజయాలతో మంచి స్థితిలో ఉంది.
👉 బలాలు:
- రుతురాజ్ గైక్వాడ్ ఫామ్
- మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్
- బౌలింగ్ స్థిరంగా ఉంది
Key Players to Watch
ముంబై
- సూర్యకుమార్ యాదవ్
- హార్థిక్ పాండ్యా
- బుమ్రా
- చెన్నై
- రుతురాజ్ గైక్వాడ్
- సంజూ శాంసన్
- శివమ్ దూబే
ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం. ముంబైకి ఇది “డూ ఆర్ డై”, చెన్నైకి “మోమెంటం మ్యాచ్”. ఎవరు ఒత్తిడిని బాగా హ్యాండిల్ చేస్తారో వారు గెలుస్తారు.
Match Turning Factors






