calender_icon.png 19 November, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మళ్లీ అక్షర్ పటేల్

19-11-2025 12:14:34 AM

న్యూఢిల్లీ, నవంబర్ 18 : ఐపీఎల్ 2026 సీజన్ కోసం వచ్చే నెలలో జరగనున్న మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ కెప్టెన్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ క్యాపి టల్స్ తమ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌నే కొనసాగించాలని నిర్ణయించింది. వచ్చే సీజన్‌లోనూ అక్షర్ జట్టును నడిపిస్తాడని సోషల్ మీడియా వేదికగా ఢిల్లీ ప్రకటించింది. గత సీజన్‌కు ముందు జరిగిన మెగావేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్‌ను రూ.16.5 కోట్లతో రిటైన్ చేసుకుంది.

పంత్ లక్నోకు వెళ్లిపోవడంతో ఈ టీమిండియా ఆల్‌రౌండర్‌కే కెప్టెన్సీ అప్పగించింది. అయితే అక్షర్ పటేల్ ఢిల్లీని ప్లే ఆఫ్స్‌కు చేర్చడంలో ఫెయిలయ్యాడు. అతని సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచ్‌లలో గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. అయినప్పటకీ మరోసారి అక్షర్‌పైనే నమ్మకముంచిన ఫ్రాంచైజీ వచ్చే సీజన్‌లోనూ అతన్నే సారథిగా నియమించింది. ఇటీవల అక్షర్‌ను కెప్టెన్‌గా తొలగిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు వద్దని చెప్పడం, సఫారీ యువ సంచలనం స్టబ్స్‌కు అనుభవం లేకపోవడంతో ఢిల్లీ ఫ్రాంచైజీ అక్షర్ వైపే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.గతంలో భారత జట్టుకు టీ ట్వంటీల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్ దేశవాళీ క్రికెట్‌లో గుజరాత్‌ను సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల్లో నడిపించాడు.