calender_icon.png 23 December, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా జెమీమా

23-12-2025 12:43:34 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 22 : వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో కీలక మార్పు జరగబోతోంది. వచ్చే సీజన్‌లో ఆ జట్టును భారత స్టార్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ నడిపించబోతోంది. ఈ మేరకు జెమీమా కెప్టెన్సీపై మంగళవారం సాయం త్రం ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేయనుంది. గత సీజన్ వరకూ ఢిల్లీకి మెగ్‌లానింగ్ సారథిగా వ్యవహరించింది. అయితే ఇటీవల వేలం సం దర్భంగా ఢిల్లీ ఫ్రాంచైజీ కో ఓవర్ పార్థ్ జిందాల్ కెప్టెన్సీ మార్పుపై హింట్ ఇచ్చారు.

రాబోయే సీజన్‌లో భారత క్రికెటరే సారథిగా ఉండబోతున్నారంటూ చెప్పారు. ఈ క్రమం లోనే వైస్ కెప్టెన్ జెమీమాకు ప్రమోషన్ ఇవ్వాలని నిర్ణయించింది. గత కొంతకాలంగా అటు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఇటు డబ్ల్యూపీఎల్‌లోనూ జెమీమా అదరగొడుతోంది. ఇటీవల మహిళల వన్డే ప్రపంచకప్‌ను భారత్ గెలవడంలోనూ కీలక పాత్ర పోషించింది.

ఢిల్లీ ఫ్రాంచైజీ భవిష్యత్తు ప్రణాళికల్లో జెమీమాకే మొదటి ప్రాధాన్యత దక్కింది. వేలానికి ముందు ఆమెతో పాటు సదర్లాండ్, షెఫాలీ వర్మ, మారిజెన్ కాప్, నిక్కీ ప్రసాద్‌లను రిటైన్ చేసు కుంది. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ నుంచీ ఢిల్లీకే ఆడుతున్న జెమీమా ఇప్ప టి వరకూ 27 మ్యాచ్‌లలో 28.16 సగటుతో 507 పరుగులు చేసింది. ఆమెను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.2 కోట్లతో రిటైన్ చేసుకుంది.