09-07-2025 10:40:55 PM
ఎమ్మెల్యే జిఎంఆర్ నోరు అదుపు తప్పింది..
బిఆర్ఎస్ నేతల మండిపాటు..
చిన్న చింతకుంట: దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి(MLA G Madhusudan Reddy) సొంత గ్రామమైన ధర్మపురి గ్రామానికి కూడా గత ప్రభుత్వమే రోడ్డు వేసిందని విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని ఆర్ఎస్ మండల అధ్యక్షులు కోటా రాము, జిల్లా సర్పంచుల మాజీ ఉపాధ్యక్షులు మోహన్ గౌడ్, మాజీ జడ్పిటిసిలు వేణుగోపాల్, వెంకటేశ్వర్ రెడ్డి లు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక సర్పంచ్ మోహన్ గౌడ్ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. పది సంవత్సరాలుగా ఎలాంటి మచ్చ లేకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యేపై ఇష్టారీతిగా మాట్లాడడం స్థానిక ఎమ్మెల్యే అవగాహన రహిత్యానికి నిదర్శనమన్నారు. గత ఎన్నికల్లో ప్రజా తీర్పుతో అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే జిఎంఆర్ ఈ 18 నెలల్లో ఎలాంటి అభివృద్ధి సాధించారో ప్రజలకు చెప్పాలన్నారు.
గత పది సంవత్సరాలలో ఎమ్మెల్యేగా ఉన్న ఆల వెంకటేశ్వర్ రెడ్డి నియోజకవర్గంలో 24 చెక్ డ్యాములు నిర్మించారని, మండల కేంద్రానికి బీసీ గురుకుల పాఠశాలను, కురుమూర్తి దేవస్థానం కి వెళ్లేందుకు ఊక చెట్టు వాగుపై వంతెన నిర్మాణం అదేవిధంగా బిటి రోడ్డు కూడా చేపట్టారని వారు తెలిపారు.మీ సొంత గ్రామమైన దమగ్నాపూర్ గ్రామానికి బీటీ రోడ్డు వేసింది కూడా గత ప్రభుత్వమేనని గుర్తుంచుకోవాలన్నారు. ప్రతిపక్షం అన్నాక ప్రజాసమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ఎమ్మెల్యే ఉంది కానీ వాస్తవాలను వెల్లడించినందుకు స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పై ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకున్నారని ఇది ప్రజాస్వామ్యవాదులు సహించరన్నారు. గత 20 సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితులు ఏంటి ఇప్పుడు కోట్లు సంపాదించారని ఎలా సంపాదించారో ప్రజలకు వివరించాలని వారు డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ అభివృద్ధి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిపై మీ సొంత గ్రామంలోనైనా, మండల కేంద్రంలోనైనా చర్చకు సిద్ధమా అంటూ ఎమ్మెల్యే జిఎంఆర్ కు బిఆర్ఎస్ నాయకులు సవాల్ విసిరారు. మారుమూల ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మించడం వల్ల ఇబ్బందులు తప్పవని ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలను కురుమూర్తి దేవస్థానం దగ్గర లేక బండర్ పల్లి వద్ద నిర్మిస్తే బాగుంటుందని దీనిపై ఎమ్మెల్యే దృష్టి సారించాలన్నారు.ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వానికి అభివృద్ధి విషయంలో సహకరిస్తాం తప్ప మా మాజీ ఎమ్మెల్యే పై నోటికొచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని టీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారు.ఈ సమావేశంలో మాజీ సర్పంచులు రవీందర్ రెడ్డి, రఘువర్ధన్ గౌడ్, నాయకులు వట్టెం రాము, రఘు వర్ధన్ రెడ్డి, చిన్న రాయుడు, అనిల్ గౌడ్, మహమూద్, కురుమూర్తి, రియాజ్ వివిధ గ్రామాల పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.