calender_icon.png 6 October, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫామ్ హౌస్‌లో మైనర్ల డ్రగ్ పార్టీ?

06-10-2025 12:56:03 AM

  1. రంగారెడ్డి జిల్లా పెద్దమంగళారం  చెర్రీ హాక్స్ ఫామ్‌హౌస్‌పై ఎస్‌వోటీ పోలీసుల దాడులు
  2. పట్టుబడిన 50 మంది.. వారిలో 25 మంది మైనర్లు 
  3. అందులో 13 మంది బాలికలే
  4. పరీక్షల్లో ఇద్దరికి డ్రగ్ పాజిటివ్ 

శంకర్‌పల్లి, అక్టోబర్ 5: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం సమీపంలో ఆదివారం రాత్రి ఎస్‌ఓటి పోలీసులు చెర్రీ హాక్స్ ఫామ్‌హౌస్‌పై దాడులు నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారికి డ్రగ్ టెస్టులు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ అని తేలింది. పట్టుబడిన 50 మందిలో  25 మంది మైనర్ ఉండగా అందులో 13 మంది బాలికలు ఉన్నారు.

బాలికలకు పోలీసు లు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మిగతా వారిని అదులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఫామ్‌హౌస్ నిర్వాహకులు రావు హౌస్ అనేవి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తెరిచి డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లు సమాచారం. పార్టీలో పా ల్గొన్న ఒక్కొక్కరి నుంచి ఎంట్రీ ఫీజు రూ. 1,300 వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫామ్‌హౌస్ నిర్వాహకుల వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.