calender_icon.png 24 January, 2026 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసముద్రంలో అభివృద్ధి పనుల జాతర

24-01-2026 12:32:31 AM

  1. నేడు మంత్రులు పొన్నం,సీతక్క, శ్రీహరి రాక
  2. సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి చొరవ

కేసముద్రం, జనవరి 23 (విజయక్రాంతి): వడ్డించేవాడు మనవాడు అయితే చాలు.. బంతిలో ఎక్కడ కూర్చున్నా బోజనానికి ఏ ఇబ్బంది ఉండదనే సామెత కేసము ద్రం విషయంలో అక్షర సత్యం అవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి కృషితో కేసముద్రం మండల కేంద్రం కొద్ది నెలల్లోనే అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి.

మం డల కేంద్రంగా ఉన్న కేసముద్రం ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇంటిగ్రేటెడ్ పాలిటెక్నిక్ , 30 పడకల ఆసుపత్రి, పోలీస్ సర్కిల్, 133 కేవీ సబ్ స్టేషన్, 32 కేవీ రెండు సబ్ స్టేషన్లు, ఫైర్ స్టే షన్, గిరిజన భవన్, షాదిఖాన, వైకుంఠ దా మము మంజూరు చేయించారు. వీటికి తో డు తాజాగా శిథిలమైన ఆర్టీసీ బస్టాండ్ స్థా నంలో కొత్తగా ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్, 30 పడగల ఆసుపత్రికి బదులు 50 పడకల ఆసుపత్రి మంజూరు చేయించారు. అలాగే కొత్తగా ఏర్పడిన కేసముద్రం మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులు నిర్వహిం చడానికి ప్రత్యేకంగా 62 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు.

ఆయా అభివృద్ధి పనులను ప్రారంభింప చేయడానికి శనివారం ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తో పాటు రాష్ట్ర మంత్రులు పొ న్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి కేసముద్రంలో వస్తున్నారు. వేం నరేందర్ రెడ్డి సొంత మండలం కేసముద్రం సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేకంగా కృషి చేస్తున్నా రు. ఇప్పటికే వందల కోట్ల రూపాయల నిధులతో పట్టణంలో ప్రధాన రహదారులను విస్తరించి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులు నిర్వహిస్తున్నారు.

ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేయలేని అభివృద్ధి పనులను, ఇప్పుడు ముఖ్యమంత్రి సలహాదారు గా స్నేహితులైన నేపథ్యంలో చేపట్టి, కేసముద్రం మండల కేంద్రాన్ని ఊహించని విధంగా రూపు రేఖలు మార్చేందుకు వేం న రేందర్ రెడ్డి చేస్తున్న కృషి పట్ల పట్టణ ప్రజ లు జేజేలు పలుకుతున్నారు.