calender_icon.png 24 January, 2026 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహేశ్వరం ముఖచిత్రం మారుతోంది

24-01-2026 12:31:19 AM

మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

మహేశ్వరం, జనవరి 23 (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ, మంఖాల్ ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన తుక్కుగూడ, మంఖాల్ డివిజన్ నాయకులతో సమావేశమై, రాబోయే ఎన్నికలు మరియు నియోజకవర్గ అభివృద్ధిపై దిశానిర్దేశం చేశారు.ఫ్యూచర్ సిటీ & ఈ-సిటీ: ఈ మెగా ప్రాజెక్టుల రాకతో ఈ ప్రాంతం ఐటీ మరియు పారిశ్రామిక హబ్గా మారుతోందన్నారు.ఔటర్ రింగ్ రోడ్ అందుబాటులో ఉండటంతో విల్లాలు, నివాస సముదాయాల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు స్థానిక నాయకులు కృషి చేయాలని సూచించారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, రిజర్వేషన్లు ఏవైనా క్షేత్రస్థాయిలో అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్, మహాలక్ష్మి బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం వంటి పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని, ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో సోషల్ మీడియా కార్యకర్తలు క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు.‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండేళ్లుగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. బీఆర్‌ఎస్, బీజేపీ కుట్రలను చిత్తు చేసి అభివృద్ధిని ప్రజలకు వివరించాలని‘ - కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ విభాగాల నాయకులు, మహిళా ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.