21-07-2025 12:59:44 AM
సిద్దిపేట రూరల్, జూలై 20: సిద్దిపేట రూరల్ మండల్ బీజేపీ ఎన్నికల ప్రబారిగా జిల్లెల్ల రమేష్ గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, తనను ఈ బాధ్యతకు ఎంపిక చేసిన రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవా దాలు తెలిపారు. ఇందుకు సహకరించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవీనేని రఘునందన్ రావు, సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ తనపై పెట్టిన నమ్మకాన్ని నిజం చేయడమే తన కర్తవ్యం అని తెలిపారు. పార్టీకి విధేయతతో, క్రమశిక్ష ణతో నిబద్ధతగా బాధ్యతలు నిర్వర్తిస్తానని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం పటిష్టంగా పని చేస్తానన్నారు.
ఇకపై బీజేపీ బలోపేతానికి గ్రామ స్థాయిలో కార్యకర్తలతో కలసి ప్రతిజ్ఞాత్మకంగా ముందడుగు వేస్తానని, తనకు సహకరించిన నాయకులు, కార్యకర్తలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.