calender_icon.png 20 December, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాప్టిస్ట్ చర్చి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

19-12-2025 12:28:00 AM

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ

కోదాడ, డిసెంబర్18: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల  పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి  బాప్టిస్ట్ చర్చి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించినట్లు బాప్టిస్ట్ చర్చి పాస్టర్ యెషయా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు . ఈ సందర్భంగా హైదరాబాద్లోని మంత్రి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలసి క్యాలెండర్ను వారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లోని కష్టాలు తొలగి ఆనందంగా, చిరునవ్వుతో జీవించాలని ఆకాంక్షించారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి పరిపాలన అందిస్తోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండెపంగు రమేష్, కోదాడ బాప్టిస్ట్ చర్చి పాస్టర్ యెషయా, కుడుముల రాంబాబు, తమలపాకుల సైదులు తదితరులు పాల్గొన్నారు.