calender_icon.png 31 December, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా వైకుంఠ ఏకాదశి

31-12-2025 01:10:29 AM

సుల్తానాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగా వైభవంగా జరిగాయి. తెల్లవారు జాము నుండే భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి, అనంతరం ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొన్నారు.  వేణుగోపాల స్వామి దేవాలయం నుండి తెల్లవారుజామున రథయాత్ర పుర వీధుల గుండా నిర్వహించారు.

కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వల్ల మురళీధర్, పూజారులు సౌమిత్రి శ్రావణ్ కుమార్, పూజారి పారువెల్ల రమేష్ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ పల్లా మురళీధర్, పెరికగిద్ద హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల రామేశ్వర్ రెడ్డి , డైరెక్టర్ పోషమల్లు, పూజారి అభిలాష్, శివాలయం కమిటీ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, పూజారి వల్లకొండ మహేష్ , వికాస తరంగిణి సభ్యులు సాదుల సుగుణాకర్ , మున్సిపల్ కమిషనర్ రమేష్ తోపాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సామాజిక సేవకులు పల్ల కిషన్ శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో పాల్గొన్న భక్తులకు తేనేటి విందు ఏర్పాటు చేశారు...