calender_icon.png 5 July, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని రంగాల్లోనూ విఫలమైన సర్కార్

02-07-2025 01:21:27 AM

ఎంఏ.జీషాన్

మలక్‌పేట్, జూలై 1 (విజయ క్రాంతి):  తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని టిఆర్‌ఎస్  పార్టీ సీనియర్ నాయకుడు, డబిర్పుర డివిజన్ అధ్యక్షుడు ఎంఏ.జీషన్ అన్నారు. పదేళ్లలో కేసీఆర్ తెలంగాణ ముస్లింలకు ఇచ్చిన హోదా అవకాశాలను అందించారని, కానీ కేవలం పద్దెనిమిది నెలల్లోనే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ వాటిని నాశనం చేయడమే కాకుండా ముస్లింలను రెండో తరగతి పౌరులుగా మార్చడంలో ఎటువంటి ప్రయత్నం చేయలేదని దుయ్యబ ట్టారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లింలకు రాజకీయ, విద్యా, ఆర్థిక రంగాలలో విప్లవం తీసుకొచ్చిందని అన్నారు. తన పదేళ్ల పాలనలో రెండు పర్యాయాలు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, తనతో పాటు ఒక ముస్లిం మంత్రిని డిప్యూటీ సీఎం గా, మొదటి పర్యాయం రెవెన్యూ మంత్రిత్వ శాఖను, రెండవ పర్యాయం హోం మంత్రిని నియమించారు. 

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో ఏ ముస్లింను గెలవనివ్వలేదని, ముస్లింకు క్యాబినెట్ లో మంత్రి పదవి ఇవ్వకపోవడం చిన్నచూపు చూడడమేనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ అడుగుజాడల్లో నడుస్తూ, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో కాషాయ రాజకీయాలను, ఎజెండాను ప్రోత్సహిస్తోందని ఎంఏ జీషన్ అన్నారు. 

ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని అనుసరిస్తూ, తెలంగాణలో కూడా ఒక ముస్లిం మంత్రికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవకాశం కల్పించడం లేదన్నారు.  ప్రజా సమస్యలతో  ముస్లింలను జాగ్రత్తగా చూసుకోగల నాయకుడు మంత్రివర్గంలో లేకపోవడం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని బయటపెట్టిందని ఎంఏ జీషన్ అన్నారు.