02-07-2025 01:20:29 AM
కాగజ్‌నగర్, జూలై౧ (విజయక్రాంతి): కాగజ్‌నగర్ ఎక్సైజ్ డివిజన్ పరిధిలో సోమవారం రాత్రి భారీగా దేశీదారు(మద్యం సీసా లు) ఎక్సైజ్ అధికారులు స్వాధీనం పరుచుకున్నారు. ఎక్సైజ్ సీఐ రవి తెలిపిన వివరాల ప్రకారం ముందస్తు సంచారం మేరకు కాగజ్‌నగర్‌లోని చెక్ పోస్ట్ వద్ద ఎక్సైజ్ సిబ్బంది వాహనాలను తనిఖీ చేయగా కారులో మహారాష్ట్ర నుంచి అక్రమంగా రవాణా చేసు న్న 17 దేశీదారు కార్టూన్లు లభించినట్లు తెలిపారు. వాటి విలువ దాదాపు రూ.70వేల వరకు ఉంటుందని సీఐ తెలిపారు. కారుతోపాటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు. దేశీదారు అక్రమ రవాణా, విక్రయాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలలో ఎస్సై పి.లోభానంద్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.