13-09-2025 01:17:54 AM
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- వేములవాడ పట్టణం బొజ్జపల్లిలో బతుకమ్మ తెప్ప నిర్మాణనికి భూమి పూజ చేసిన విప్
వేములవాడ టౌన్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి):ప్రజల ఆలోచనలకు అనుగుణం గా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ప్ర భుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు..శుక్రవా రం వేములవాడ పట్టణంలో 5 వార్డు మహాలక్ష్మి విధి,నాంపల్లి, బొజ్జపల్లి లో పలు కుల సంఘ,మహిళ సంఘా భవనాల నిర్మాణనికి స్పెషల్ డేవలెప్మెంట్ ఫండ్స్ నుండి మంజూ రు కాబడిన ప్రొసీడింగ్ పత్రాలను. రాష్ట్ర ప్ర భుత్వ విప్ ఆది శ్రీనివాస్ అందజేశారు.. బొజ్జపల్లి లో మహిళ సంఘ భవనం, బతుక మ్మ తెప్ప, పెద్దమ్మ తల్లి దేవాలయం ప్రహరీ గోడ నిర్మాణనికి భూమి పూజ నిర్వహించారు..వారు మాట్లాడుతూ.
గత ఎన్నిక ల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుతూ ముం దుకు పోతున్నాం అన్నారు.. ప్రజా ప్రభుత్వంలో ప్రజలను అభివృద్ధిలో భాగస్వా మ్యం చేస్తూ ముందుకు పోతున్నామన్నారు. ధనిక రాష్ట్రం తెలంగాణను గత పాలకులు అ ప్పుల కుప్పగా మార్చి ఆర్థిక వ్యవస్థను వి ధ్వంసం చేశారని ప్రభుత్వ విప్ ధ్వజమెత్తా రు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందులు పడుతున్నప్పటికీ గత పాలకుల హయంలో ప్రారంభించిన పథకాలను కొనసాగిస్తూనే, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట మేర కు ఒక్కొక్క హామీ అమలు చేస్తున్నామని అ న్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 48 గం టల వ్యవధిలో రాజీవ్ ఆరో గ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, మహిళలకు ఆర్టిసి బ స్సులో ఉచిత బస్సు ప్రయా ణం పథకాలను ప్రారంభించామని అన్నా రు. ఆరోగ్య శ్రీ, వ్యవసాయానికి ఉచిత విద్యు త్ ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలను కొనసాగి స్తూ అదనంగా పేదలకు 200 యూనిట్ల ఉ చిత విద్యుత్ సరఫరా చే స్తున్నామని అన్నా రు.500 రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని, 25 లక్షల రైతులకు 2 లక్షల వరకు పంట రుణ మాఫీ, సన్న వడ్లకు క్వింటాళ్ల 500 బోనస్, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రెసిడెన్షియల్ పాఠశాలలో 40% డైట్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్ చార్జీల పెం పు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం వంటి అనేక సంక్షే మ అభివృద్ధి కార్యక్రమాల చేపట్టామని అ న్నారు.
ప్రాంతీయ సాంస్కృతిక వారసత్వాని కి ప్రతీక బతుకమ్మ పండుగప్రాంతీయ సాం స్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ పం డుగ అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు..బొజ్జపల్లి బతుకమ్మ తెప్ప నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.. ప్రాంతీ య సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూ, మహిళల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ఈ తెప్ప నిర్మాణం ముఖ్యమైన భాగంగా మారనుందని పేర్కొన్నారు..స్థానిక ప్రజల,మహిళలల ఆవశ్యకత లను దృష్టిలో ఉంచుకొని బతుకమ్మ తెప్ప నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు.