calender_icon.png 13 September, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ మద్యం కేసు.. సంగారెడ్డి జిల్లాలో సిట్ సోదాలు

13-09-2025 01:26:43 AM

సంగారెడ్డి, సెప్టెంబర్ 12(విజయక్రాంతి)ః ఏపీ మద్యం కేసులో సిట్ దర్యాప్తు వేగవం తం చేసింది. ఈ కేసుకి సంబంధించి శుక్రవా రం తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో సిట్ అధికారులు సోదాలు నిర్వహిచారు. ఇస్మాయిల్‌ఖాన్ పేటలోని గ్రీన్‌టెక్ ఇంజినీరింగ్ సిస్టమ్‌లో ౯మందితో కూడిన సిట్ బృందం తనిఖీలు చేపట్టింది. సంస్థ యజమాని సందీప్‌రెడ్డిని అధికారులు కేసుకి సంబంధించిన వివరాలు అడిగారు.

లిక్కర్ స్కామ్‌కు సం బంధించి హైదరాబాద్, విశాఖలోని నర్రెడ్డి సునీల్‌కుమార్‌రెడ్డికి చెందిన 10 కంపెనీల్లో సిట్ అధికారులు గురువారం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ ౩ స్నేహహౌస్‌లో, రోడ్ నంబర్ ౨ సాగర్ సొసైటీలో, కాటేదాన్ ఖైరతాబాద్ కాలనీ ఫేజ్‌పు కార్యా లయా ల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.