13-09-2025 01:16:01 AM
హుజురాబాద్,సెప్టెంబర్ 12:(విజయ క్రాంతి); అకాల వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని త్వరగా అంచనా వేసి నివేదిక అందించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులు సూచించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్ట ణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. పట్టణంలో అకాల వర్షంతో నష్టపోయి న వారికి వెంటనే నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. డ్రైనేజీలు సక్రమంగా ఉండేటట్టు చూడాలన్నారు.
లోతట్టు ప్రాంతాల్లో వరదలు రాకుండా శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులు సూచించారు. హుజురాబాద్ నియోజకవర్గం లో కోతుల వల్ల చాలామందికి గాయాలు అయినాయని, ఉపేందర్ అనే వ్యక్తి కూడా మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. డబుల్ బెడ్ రూములు, ఇందిరమ్మ ఇల్లులు నిరుపేదలకు అందేటట్టు చూ డాలన్నారు. వచ్చే సద్దులబతుకమ్మ, దసరా పండుగను ఘనంగా నిర్వహించాలని, బతుకమ్మ కేంద్రాల వద్ద మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తదితకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తోపాటు వివిధ శాఖలకుచెందిన అధికారులుపాల్గొన్నారు.