calender_icon.png 4 November, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మంగళ కైశిక యాగం

03-11-2025 12:00:00 AM

మందమర్రి, నవంబర్ 2 : పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో మిత అయ్యల్వర్ కుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కైశిక ద్వాదశి యాగం ఘనంగా నిర్వహించారు. టీటీడీ ఆదేశాల మేరకు మన గుడి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో ఆదివారం కుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా యాగం నిర్వహించారు. అంతకు ముందు దేవత మూర్తులతో అలంకరించిన పల్లకి సేవను పట్టణం లోని మార్కెట్ పురవీధుల గుండా ఊరేగించారు.

అనంతరం ఆలయంలో గణపతి, గౌరీ, నవగ్రహాలు, అష్టోత్తర, పూజలు తో పాటు హోమం నిర్వహించారు. ఆలయ అర్చకులు గోవర్ధనగిరి అనంతరాచార్యులు, శ్రీకరాచార్యులు, హరి ల ఆధ్వర్యంలో జరిగిన పూజ కార్యక్రమాల్లో కుల సంఘం జిల్లా అధ్యక్షులు నాగవెళ్లి వెంకటస్వామి, గౌరవాధ్య క్షులు ధర్మపురి నర్సయ్య, ప్రధాన కార్యదర్శి సాత్వాడి విజయ్, సహాయ కార్యదర్శి ధర్మపురి శ్రీనివాస్, రమేష్ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.