03-11-2025 12:00:00 AM
ముమ్మర ఏర్పాటు చేస్తున్న జిల్లా జాగృతి సభ్యులు
ఆదిలాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి) : జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమం పేరుతో జిల్లాలో ఆమె ఈనెల 3, 4వ తేదీల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందుకుగాను ఆదిలాబాద్ జిల్లా జాగృతి అధ్యక్షుడు రంగినేని శ్రీనివాస్ రావు, సభ్యులు ఇప్పటికే ఏర్పాట్లు చేపట్టారు. కవితా పర్యటన సందర్భంగా గత 2 రోజుల గా తెలంగాణ రాష్ట్ర జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ చారి జిల్లాలో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
కవిత రెండు రోజుల కార్యక్రమా లకు సంబంధించిన పోస్టర్లను స్థానిక సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. తొలిరోజు పర్య టనలో బాగంగా ఆదిలాబాద్ పత్తి మార్కెట్ యార్డు సందర్శించి, రైతులతో ముఖాముఖి కానున్నారు. అనంతరం చెనాకా కొరాటా బ్యారేజ్ నిర్మాణాన్ని సందర్శించి, నిర్వాసిత రైతులతో సహపంక్తి భోజనం చేస్తారు. అక్కడి నుండి జైనథ్ లోని పురాతన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ దర్శించుకుంటారు.
అదేవిదంగా ఆదిలాబాద్‌లోని దివంగత సాహితీవేత్త సామల సదాశివ మాస్టారు నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో సమావేశం అవుతారు. సాయం త్రం గోండు భాషలో మహా భార తం రాసిన ప్రముఖ సాహితీవేత్త తొడసం కైలాష్ నివాసంలో పలువురు గోండు ప్రముఖులతో సమావేశం కానున్నారు. రెండవ రోజు నాలుగవ తేదీన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి కానున్నారు.