24-04-2025 12:00:00 AM
ఎమ్మెల్సీ దండే విఠల్
కాగజ్‌నగర్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): పేదల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యే క దృష్టి సారించిందని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. బెజ్జుర్ మండలంలో కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జాయింట్ కలెక్టర్ డేవిడ్, కాగ జ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాలతో కలిసి సన్న బియ్యం లబ్ధిదారుడు పెద్దల శంకర్ ఇంట్లో సహపంక్తి భోజనం చేశారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడు తూ.. పేదవారి ఇంట్లో భోజనం చేయడం సంతోషంగా ఉందని, ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న సన్నబియాన్ని లబ్ధిదా రులు సద్వినియోగ పరుచుకోవాలన్నారు. సన్నబియ్యం పక్కదారి పట్టకుండ అధికారులు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.