calender_icon.png 1 November, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా రన్ ఫర్ యూనిటీ

01-11-2025 12:21:04 AM

పీపుల్స్ ప్లాజాలో ఐదు వేల మందితో పరుగును ప్రారంభించిన నటుడు చిరంజీవి

సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 31 (విజయక్రాంతి): అఖండ భారత్ నిర్మాత, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరం ఐక్యతా స్ఫూర్తితో పులకించింది. రాష్ట్రీయ ఏక్తా దివ ను పురస్కరించుకుని హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వేదికగా నిర్వహించిన ’రన్ ఫర్ యూనిటీ’ పరుగును మెగాస్టార్ చిరంజీవి జెండా ఊపి ప్రారంభించారు.

డీజీపీ శివధర్‌రెడ్డి, సీపీ సజ్జనార్, ఇతర ఉన్నతాధి కారులు, సుమారు ఐదువేల మంది పౌరు లు, రన్నర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. 560 సంస్థానాలుగా విడిపోయిన దేశాన్ని ఏకం చేసి, ఒకే దేశం’గా మనకు అందించిన మహనీయుడు సర్దార్ పటేల్ అని, ఆయన స్ఫూ ర్తిని ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్న పోలీసులను అభినంది స్తున్నా ను అని అన్నారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న డీప్ ఫేక్’ సమస్యపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. “ఇది కేవలం పరుగు కాదు, జాతీ య ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాల్సిన కార్యక్రమం” అని అన్నారు. సజ్జనార్ మాట్లాడుతూ యువత పటేల్ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ ఎంఎం భగవత్, జాయింట్ సీపీలు తఫ్సీర్ ఇక్బాల్, జోయల్ డెవిస్, డీసీపీలు శిల్పావళ్లి, అపూర్వారావు, ధార కవిత, లావణ్య నాయక్ జాదవ్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.