calender_icon.png 1 November, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాగృతి జనం బాట ఎవరి కోసం

01-11-2025 12:23:19 AM

యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్

కరీంనగర్,(విజయ క్రాంతి): జాగృతి జనం బాట ఎవరికోసం అని,  ఇన్ని సంవత్సరాలు మీకోసం పనిచేసినకార్యకర్తలను మీరు వేధించిన తరువాత   బాగున్నారా.. లేదా అని ఓదార్చడం కోసమా, లేక వారిని నమ్ముకొని ఉన్న కుటుంబాల నోటినుండి శాపనార్థాలు వినడం కోసమా అని యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. శూన్యమైన మీ రాజకీయ జీవితాన్ని మళ్లీ తెరపైకి తేవడానికే ఈ ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. బీసీ వాదం నడుస్తున్న ఈ తరుణంలో కూడా బీసీలకు పదవులు ఇచ్చినట్టే ఇచ్చి, కీరోలు పోషించే వారిలో మాత్రం రావులనే పెట్టుకుంటున్నారని, మిమ్ములను ఎవరు నమ్మరని తెలిపారు. నిజంగా బీసీల ఉన్నతి కోసం లేక పేద వర్గాల అభివృద్ధి కోసం జరిగిన జనం బాట కాదని అజీమ్ తెలిపారు.