01-11-2025 12:20:29 AM
బీర్కూర్ బిజెపి నాయకులు తహసిల్దార్ కు వినతి
బాన్సువాడ,(విజయక్రాంతి): తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని బిజెపి నాయకులు శుక్రవారం డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ కు బిజెపి నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీర్కూరు మండల బిజెపి అధ్యక్షులు సాయికిరణ్ మాట్లాడుతూ.. రైతులకు క్వింటాలకి 500 రూపాయలు ఇస్తా అన్న బోనస్ ఇవ్వాలని అలాగే వడ్లు కొనుగోలు చేసే సమయంలో తరుగు తీయకుండా వడ్లు కొనుగోలు చేయాలని, అలగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకం ఈ రాష్ట్రంలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులని వెంటనే ఆదుకోవాలనీ లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేసి రైతులకు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.