calender_icon.png 12 October, 2025 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక వడ్డీ ఆశ చూపి 50 కోట్లకు కుచ్చు టోపీ

11-10-2025 07:45:57 PM

- అమాయక ప్రజలు, ఏజెంట్ల ద్వారా వసూలు 

- మోసం చేసిన నిందితున్ని ఆరెస్ట్

- 2 కార్లు విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం

నల్గొండ క్రైం: అధిక వడ్డీ ఆశ చూపి 50 కోట్ల మేరకు ప్రజలకు కుచ్చుటోపి పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు అతని వద్ద నుండి ఒక ఫార్చునర్ స్కార్పియో కారు, వ్యవసాయ భూముల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు నిందితుని వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పీఏ పల్లి మండలం వద్దిపట్ల (పలుగు తండా) గ్రామానికి చెందిన రమావత్ బాలాజీ నాయక్ రియల్ ఎస్టేట్ చేస్తూ ప్రజలకు అధిక వడ్డీ ఆశ చూపి రూ.కోట్ల వసూలు చేశాడు.

అందుకు అనుగుణంగా ఏజెంట్లను నియమించుకున్నాడు 2019 లో డిగ్రీ లో ఫెయిల్ అయిన తరువాత 2020 లో ఐస్ క్రీమ్ పర్లాల్ వ్యాపారం కొరకు బందువుల వద్ద 5 లక్షలు, 2 రూపాయల వడ్డీకి తీసుకొని వ్యాపారంలో నష్ట పోయినాడు. తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని డబ్బులు 2 రూపాయల వడ్డీకి దొరకగపొగ 6 రూపాయల వడ్డీ ఇస్తానని ఆశ చూపి నమ్మించి.10 లక్షలు ఒకరి వద్ద, 5 లక్షలు మరొకరి వద్ద తీసుకొని వడ్డీ చెల్లిస్తూ నమ్మించగా వీరిని చూసి మరి కొంత మంది ఏజెంట్లను పలుగు తండా  చుట్టూ ప్రక్కల గిరిజన తాండలు, గ్రామాల నుండి ఏర్పాటు చేసుకొని అధిక వడ్డీ ఇస్తానని ఆశ పెట్టి వీరి వద్ద డబ్బులు తీసుకొని వారికి ప్రామిసరీ నోట్లు వ్రాసి ఇచ్చి నెలకు 10 రూపాయల వడ్డీ చెల్లించాడు.

అతని విలాసవంతమైన జీవన శైలిని, ఖరిదైన కార్లు  విల్లాలు కొనుగోలు చేసి జనాల నమ్మకాన్ని చూరగొన్నాడు.ఏజెంట్లుగా తన బందువులు, స్నేహితులుఉన్నారు. పుట్టనగండి తండా, గడ్డమీది తండా, చింతల్ తండా, నక్కల పేట తండా, పావురాల గట్టు,వద్ధిపట్ల గ్రామాల గిరిజన ప్రజల వద్ద అదిక వడ్డీ ఆశ చూపి వారి వద్ద డబ్బులు వసూలు చేసి వారికి ప్రామిసరీ నోట్లు వ్రాసి ఇచ్చి ఆ డబ్బులను బాలాజీ నాయక్ కి ఏజెంట్లు ఇచ్చేవారు.ఈ డబ్బులతో  బందువుల, స్నేహితుల పేర్లతో వ్యవసాయ భూములు, ఇండ్లు కరీదైన కార్లు, బైక్ లు కొని జల్పాలు చేశాడు.

 ఇంకా అధిక డబ్బులు వసూలు చేసే ఉద్దేశంతో నెలకు 10 రూపాయల వడ్డీ ఇస్తానని జనాలను నమ్మించి కోట్లలో డబ్బులు వసూలు చేసి వడ్డీ మాత్రమే ఇచ్చి బాదితుల వద్ద ఉన్న ప్రామిసరీ నోటు వెనుకల వడ్డీ ఇచ్చినట్లు వ్రాసి పాత ప్రామిసరీ నోటు తీసుకొని కొత్త ప్రామిసరీ నోటు అదే అసలు అమౌంట్ కి వ్రాసి ఇచ్చేవాడు. వచ్చిన కోట్ల డబ్బులతో వైన్స్ పాప్ పర్మిషన్ ల కోసం సుమారు 2.3 కోట్లు, స్టాక్ మార్కెట్ ఇంట్రా డే ఆన్ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) , RBN సాఫ్ట్వేర్ సొల్యూషన్ సాఫ్ట్వేర్ కంపెనీ లలో పెట్టుబడులు పెట్టి నష్ట పోయినాడు.బ్యాంక్ లో వచ్చే వడ్డీ కంటే 10 రేట్లు ఎక్కువ వడ్డీ ఇవ్వడం తో జనాలు ఆకర్షితులై బాలాజీ నాయక్ కి అధిక మొత్తంలో డబ్బులు ఇచ్చారు.

గత కొన్ని నెలలుగా బాదితులకు అసలు, వడ్డీ డబ్బులు ఇవ్వలేక పోయే సరికి బాదితులు బాలాజీ నాయక్ పై వత్తిడి చేశారు డబ్బులు ఇవ్వలేక బాలాజీ నాయక్ బాదితుల నుండి తప్పిచ్చుకొని పారిపోయాడు. 106 మంది బాదితులు మోసపోయారన్నారు. బాలాజీ నాయక్, బీనామి ఆస్తులను  గుర్తించి ప్రభుత్వం ద్వారా జప్తు చేసి కోర్టు ద్వారా బాదితులకు న్యాయం చేస్తామన్నారు. బాడితులు నేరుగా వారి వద్ద ఉన్న పత్రాలతో గుడిపల్లి పోలీస్ వారిని సంప్రదించి కేసులు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు సమావేశంలో సమావేశంలో దేవరకొండ ఏ.ఎస్.పి మౌనిక అడిషనల్ ఎస్పి రమేష్ తదితరులు పాల్గొన్నారు