calender_icon.png 12 October, 2025 | 12:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు..

11-10-2025 07:50:07 PM

పట్టణ సీఐ శివశంకర్..

కోదాడ: మైనర్లు ద్విచక్ర వాహనాలు నడిపితే బాధ్యులపై చర్యలు తప్పవని కోదాడ టౌన్ సీఐ శివశంకర్ అన్నారు. శనివారం పట్టణంలో మైనర్ డ్రైవింగ్ చేసినటువంటి 35 ద్విచక్ర వాహనాలు, వాటినీ డ్రైవ్ చేసిన వ్యక్తులు వారి తల్లిదండ్రులు అందరికీ పట్టణ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చి అనంతరం ఆయన మాట్లాడారు. రోడ్డు భద్రత, హెల్మెట్‌ ధరించడం గురించి అవగాహన కలిగించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. లైసెన్స్‌, సి-బుక్‌, ఇన్సూరెన్స్‌, హెల్మెట్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు.

హెల్మెట్‌ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో 90 శాతం ప్రాణాపాయం నుంచి బయట పడవచ్చునని చెప్పారు. కుటుంబ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు హెల్మెట్‌ ధరించాలని సూచించారు. వాహనదారులు డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనాలను నపడితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వాహనదారుడు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోదాడ ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.