11-10-2025 07:52:52 PM
భారీగా హాజరైన స్వయం సేవకులు..
కన్నుల పండుగగా పద సంచలనం..
తాండూరు (విజయక్రాంతి): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వందలాది స్వయం సేవకులు గణవేష్(యూనిఫామ్) ధరించి పద సంచలనం(ర్యాలీ) చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధులు, పురవీధుల గుండా పత సంచలనం సాగింది. ప్రత్యేక వాహనంలో భరతమాత, సంఘ వ్యవస్థాపకులు డాక్టర్ బలిరాం హెడ్గేవర్, గురూజీ చిత్రపటాలు ఏర్పాటు చేసి ఊరేగింపు నిర్వహించారు. దారి పొడవునా పుర ప్రముఖులు, యువకులు, మహిళలు, హిందూ సంఘాల నాయకులు పోటీపడి పూల వర్షం కురిపిస్తూ భారత్ మాతాకీ జై అంటూ చేసిన నినాదాలు పట్టణంలో మారుమ్రుగాయి. ఇంకా ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.