11-10-2025 07:44:40 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 13వ తేదీ నుండి యధావిధిగా కొనసాగించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం యధాతధంగా నిర్వహించడం జరుగుతుందని, అర్జీదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.