06-11-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 5 (విజయక్రాంతి): యువతకు అత్యున్నత ఉద్యోగాలు కల్పించడం, వారిని గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయడం, పరిశో ధనలకు పెద్దపీట వేయడంలాంటి లక్ష్యాలతో తాము ముందుకెళుతున్నామని విజ్ఞా న్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ నాగభూషణ్ బుధవారం తెలిపారు. విజ్ఞాన్ యూనివర్సిటీ 2026 సంవత్సరానికి సంబంధించి బీటెక్, బీఫార్మసీ, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీఏ ఎల్‌ఎల్బీ (హానర్స్), బీబీఏ ఎల్‌ఎల్బీ (హానర్స్), బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్, ఫార్మ్‌డీ అడ్మిషన్ల వీశాట్ 202627 నోటిఫికేషన్‌ను ఆయన విడుదల చేశారు.
ప్రవేశాలకు తాము దేశవ్యాప్తంగా చేపట్టనున్న వీశాట్ ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా స్కాలర్షిప్స్ పొందే అవకాశం ఉందని తెలిపారు. మార్చి 1 నుంచి నుంచి ఏప్రిల్ 15 వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డీన్ అడ్మిషన్స్ డాక్టర్ కేవీ క్రిష్ణకిషోర్ తెలిపారు. వీశాట్ దరఖాస్తులు గుంటూరు, విజయవాడ, హైదరాబాదు, విశాఖపట్టణం, ఏలూరు, రాజమండ్రిలలోని అన్ని విజ్ఞాన్ సంస్థలు, కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు.
విద్యార్థులు యూనివర్సిటీ వ్బుసైట్ (https://admissions.vignan.ac.in/) ద్వారా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. వీశాట్ దరఖాస్తును ఫిబ్రవరి 25 లోగా పూర్తిచేయాలన్నారు. వీశాట్‌లో తొలి 50లోపు ర్యాంకులు సాధించిన వారికి 50శాతం, 51 ర్యాం కుల వారికి 25 శాతం, 201 2000లోపు ర్యాం కులు సాధించినవారికి 10 శాతం ఫీజు స్కా లర్షిప్ అందజేస్తున్నట్లు చెప్పారు.
ఇంటర్ మార్కులు, జేఈఈ, మెయిన్స్, ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానూ ఫీజు స్కాలర్షిప్కు అవకాశం కలదు. ప్రతిభావంతులైన బీఫార్మసీ, బీబీఏ, బీసీఏ,బీఏ ఎల్‌ఎల్బీ, బీబీఏ ఎల్‌ఎల్బీ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సు లు చదివే విద్యార్థులు సైతం ఫీజుల్లో స్కాలర్షిప్ పొందొచ్చని చెప్పారు. అన్ని విభాగాల్లో 25 శాతం సీట్లను స్కాలర్షిప్ కింద కేటాయించామన్నారు. వీటిని ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తామని తెలిపారు. వీశాట్ పరీక్ష రాసిన వారికి బీటెక్ సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.
పరిశ్రమలకు అనుగుణమైన సిలబస్
తమ యూనివర్సిటీ ఎప్పటికప్పుడు పాఠ్యాంశాలను మారుస్తూ.. పరిశ్రమ అవసరాలకు తగిన విధంగా సిలబస్ను కూర్చు తోందని వైస్ చాన్స్లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ తెలిపారు. పాఠ్యాంశాలనన్నింటినీ ప్రయోగశాలలకు మరియు ప్రాజె క్టులకు అనుసంధానించడం, పరిశ్రమలకు తీసుకెళ్లి అవగాహన కల్పిస్తుండటం వల్ల విద్యార్థులకు బోధనను ఎంతో ఆసక్తిగా మార్చగలిగామని వెల్లడించారు. బీటెక్ కోర్సుతోపాటు 200 గంటలపాటు ప్రత్యేకంగా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ (సీఆర్టీ) తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు.
దీనివల్ల ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఎనలైటికల్ స్కిల్స్ పెరుగుతాయని తెలిపారు. 90 శాతం మంది విద్యార్థులు ఉద్యో గాల్లోను, 10 శాతం మంది విద్యార్థులు ఉన్నత చదువులకు విదేశాలకు వెళుతున్నారని వెల్లడించారు. సివిల్స్ కోచింగ్ కూడా అందిస్తున్నామని ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ దిరిశాల విజయరాము తెలిపారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బందిలో పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యాలు పెరిగేం దుకు 12 దేశాలకు చెందిన యూనివర్సిటీలతో తాము అవగాహన ఒప్పందాలు కుదు ర్చుకున్నామని చెప్పారు.
ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడంలో తమ యూనివర్సిటీ ఎప్పుడూ ముందుంటుందని డైరెక్టర్ అడ్మిషన్స్ ఏ. గౌరిశంకర్ రావు తెలిపారు. గతేడాది ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు మొత్తం అన్ని కోర్సుల్లో రూ.48 కోట్లకు పైగా స్కాలర్షిప్స్ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, ఇంచార్జి రిజిస్ట్రార్ డాక్టర్ విజయరాము, డీన్ అడ్మిషన్స్ డాక్టర్ కేవీ క్రిష్ణకిషోర్, డిప్యూటీ రిజిస్ట్రార్ ఏ. గౌరిశంకర్ రావు పాల్గొన్నారు.