10-08-2025 12:00:00 AM
-రాఖీ కట్టించుకుని వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
- అక్కడికక్కడే యువకుడు మృతి
నిజామాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): సోదరితో రాఖీ కట్టించుకుని తిరుగు ప్రయాణమైన యువకుడిని కంటైనర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిర్మల్ జిల్లా బాసరకు చెందిన సాయి బబ్లూ (21) సోదరి నిజామాబాద్ నగరంలోని రోడ్డులో అత్తారింటిలో ఉండ గా.. శనివారం బాసర నుంచి మరో యువకుడితో కలిసి బైక్‌పై వచ్చాడు. అక్కతో రాఖీ కట్టించుకుని బైక్‌పై తిరిగి బాసర వెళ్తుండగా నవీపేట్ మండలం జగ్గారావు ఫారం వద్ద కంటైనర్ ఢీకొట్టింది. బబ్లూ అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.