10-08-2025 12:00:00 AM
-రూ.50 కోట్లు మంజూరు
-ఫలించిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి కృషి
కోదాడ, ఆగస్టు 9: కోదాడ నియోజకవర్గానికి ప్రతిష్ఠాత్మక జవహర్ నవోదయ విద్యాలయం మంజూరైందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కోదాడలోని కేఆర్‌ఆర్ కళాశాల సమీపంలో 19.12 ఎకరాల్లో రూ.50 కోట్ల నిధులతో ఈ విద్యాలయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు.
త్వరలో విద్యాలయం నిర్మాణం ప్రారంభమవుతుందని, రెండు సంవత్సరాల్లో విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారని పేర్కొన్నారు. ఈ విద్యాలయంలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచితంగా ఆంగ్ల మాధ్యమంలో సీబీఎస్‌ఈ విధానంలో మెరుగైన విద్య లభిస్తుందని మంత్రి తెలిపారు.
మంత్రి ఉత్తమ్, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కృషి ఫలించి నియోజకవర్గ వాసుల కలైన జవహర్ నవోదయ విద్యాలయం మంజూరు కావడంపై స్థానిక ప్రజలు, విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలైన విద్య అందించేందుకు కృషి చేస్తున్న ఉత్తమ్ దంపతులను అభినందించారు.