13-08-2024 12:00:00 AM
భిన్నత్వంలో ఏకత్వం సూత్రాన్ని అనుసరిస్తున్న అఖండ భారతదేశంలో ‘భారతదేశం నా మాతృభూమి’ అనే ప్రతిజ్ఞ ద్వారా కాశ్మీర్‌నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరి గుండెల్లో దేశభక్తిని, జాతీయ సమైక్యతను, సమగ్రతను చాటిన తెలుగుతేజం పైడిమర్రి వెంకట సుబ్బారావు. భారత స్వాతంత్య్ర సం గ్రామంలో ‘వందేమాతరం’ పాట ఎలా భారతీయుల్లో దేశభక్తిని, స్వతంత్ర కాంక్షను రగిలించిందో స్వాతంత్య్రానంతరం వీరి జాతీ య ప్రతిజ్ఞ భారతీయుల్లో ఐక్యతను, దేశభక్తిని, జాతీ య సమగ్రతను చాటింది. 1916 జూన్ 10న నల్లగొండ జిల్లా అన్నె పర్తిలో జన్మించిన పైడిమర్రి మంచి రచయిత, బహు భాషావేత్త.
ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో ట్రెజరీ విభాగంలో ఉద్యో గం పొందారు. పుస్తక పఠనం, సేకరణ, కవితా వ్యాసంగం, వేదాధ్యయనం చేసేవా రు. పలు భాషల్లో ప్రావీణ్యం గల పైడిమర్రి వెట్టిచాకిరి, భూస్వామ్య వ్యవస్థపై పలు రచనలు చేశారు. ఆయన తన 18వ ఏటనే ‘కాల భైరవుడు’ పేరున నవల రాశారు.
‘భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను..’ అని సాగే ‘ప్రతిజ్ఞ’ పిల్లల గుండెల నిండా దేశభక్తిని పాదుకొల్పుతున్నది. ఇది 1962లో వారి కలం నుండి పురు డు పోసుకున్నది. భారతీయులంతా గర్వించదగ్గ రచయితగా పాఠకు ల గుండెల్లో నిలిచిపోయిన ఆయన 1988 ఆగస్టు 13న తుదిశ్వాస విడిచారు. ‘ప్రతిజ్ఞా’ పాలన భారతీయ బాలలందరికీ స్వీయ క్రమశిక్షణను నేర్పుతూ, జాతి గొప్పతనాన్ని ఆత్మీయంగా, అద్భుతంగా చాటుతున్నది.
యం. రాం ప్రదీప్