calender_icon.png 13 September, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్‌కే విజయావకాశాలు?

11-08-2024 12:05:00 AM

యుఎస్, భారత్‌ల అనుబంధాన్ని సూచించేలా 2019 సెప్టెంబర్ 20న అమెరికాలోని హ్యూస్టన్, టెక్సాస్‌లో ఉన్న ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సమ్మిట్, మెగా ఈవెంట్ ‘మోదీ హౌడీ’కి 50 వేలమందికి పైగా ఇండో అమెరికన్లు హాజరయ్యారు. ఈ రకంగా రెండు దేశాల ఐక్యత, సామరస్య భావం తెలియచెప్పటం ఇరు దేశాల ప్రజల్లో పదిలంగా నేటికీ గుర్తుంది.

అమెరికా వంటి అగ్రరాజ్య అధ్యక్ష పదవికి ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ 5న జరుగనున్నాయి. బైడెన్ తన అభ్యర్థిత్వం నుండి తప్పుకుని కమలా హారీస్‌ను డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిం చాక హోరాహోరీగా ప్రచారంలో ఆమె కు విజయవకాశాలు కొంత మెరుగయ్యాయని భావన కలిగినట్లు చెప్పాలి. భారత్‌లా ఐదేళ్ల పదవి కాకుండా, అమెరికాలో  నాలుగు సంవత్సరాలు మాత్రమే పదవిలో వుండే కాలానికి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఆ రోజు ఎన్నుకుంటారు.

ఈ ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా నల్ల జాతీయరాలు, భారతీయ మూలాలున్న కమలాదేవి హారీస్‌ని ఆ పార్టీ ఎంపిక చేయటంతో అప్పటి వరకు అప్రహతిహతంగా సాగుతున్న ట్రంప్ విజయావ కాశాలకు కొంత వెనకడుగు పడిందని విశ్లేషిస్తున్నారు. కానీ, కమలా హారీస్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని హర్షిస్తున్నప్పటికీ ప్రవాస భారతీయుల్లో అంతగా ఉత్సాహం కనిపించటం లేదని చెప్పాలి.

కారణం, ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా ఉన్న ఆమె ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం, సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ అంతగా శ్రద్ధ చూపలేదనే నిస్పృహతో వున్నారు. చెన్నైకి చెందిన ఆమె తల్లి శ్యామ లా గోపాలన్ వివాహం చేసుకున్నది ఆఫ్రో జమైకన్‌కి చెందిన నల్ల జాతీయుడు. అందుకే, ఆమె నల్లజాతియురాలిగానే చలామణి అవుతున్నారు. ఆగస్టు 19న అధికారికంగా డెమోక్రటిక్ పార్టీ ఆమెను అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటిస్తుంది. 

ఇదిలా ఉంటే, ఇటీవల ఒక ర్యాలీలో పాల్గొన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దుండగుడొకడు కాల్పులు జరపటంతో వెంట్రుక వాసిలో మృత్యువు నుండి ఆయన బయటపడిన సంగతి ప్రపంచానికి తెలిసిందే. దీంతో ట్రంప్‌కు విపరీతంగా ప్రజల్లో సానుభూతి పెరిగింది. తప్పని స్థితిలో డెమోక్రా టిక్ పార్టీ తరపున ఇటీవలి వరకు అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న బైడెన్ ఆకస్మికంగా పోటీనుండి తప్పనిసరిగా విరమించుకోవాల్సి వచ్చింది.

కారణం, తెరవెనుక మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, బరాక్ ఒబామా లాంటి డెమోక్రాటిక్ ప్రముఖులు ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షురాలుగా పదవిలో వున్న కమలాదేవి హారీస్‌ను అధ్యక్ష అభ్యర్థిగా నిలపాలని సూచిస్తుండడం. అధ్యక్షు డు బైడెన్ వయసు మీద పడటం, అనారోగ్యం, ప్రచారంలో మాటలు తడబడటం లాంటి కార ణాలు ఒకవైపు, దుండగుడు కాల్పులు జరపటంతో ట్రంప్‌కు విపరీతంగా పెరిగిన సానుభూతి పవనాలు మరోవైపు చూపి, బైడెన్‌కు విజయాకావకాశాలు అసలే మాత్రం లేవని కమలాదేవి హారీస్‌ను అధ్య క్ష పదవికి రంగంలోకి దింపటం జరిగింది. 

కమలాదేవి హారీస్ 1964 అక్టోబర్ 30న అమెరికాలో జన్మించారు. కమలా హారీస్ తల్లి శ్యామల గోపాలన్ మద్రాసులో జన్మించారు. ఆమె తన 19వ ఏటే ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పట్టభద్రురాలయ్యారు. 1958లో భారతదేశాన్ని వదలి అమెరికా వెళ్లారు. ఆమెరికా చేరిన ఆమె  కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చేరి అక్కడ  న్యూట్రిషన్, ఎండోక్రయనాలజీలో డాక్టర్ పట్టా పొందారు. ఒక ఉద్యమంలో పరిచయమైన ఆఫ్రో -జమైకన్ మూలానికి చెందిన జమైకన్- అమెరికన్ డోనాల్ జె హారీస్‌ను 1962లో వివాహం చేసుకున్నా రు. ఆయన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొ ఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ (ఎమెరిటస్)గా జమైకా నుండి 1961లో యునైటెడ్ స్టేట్స్ కు చేరుకున్నాడు.

1962లో వివాహం చే సుకున్న వారికి కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో ఇద్దరు ఆడపిల్ల లు, కమల హారీస్, మాయ హారీస్‌లు జన్మించారు. కమల హారీస్ ఉన్నత విద్యాభ్యాసం హోవార్డు, కాలిఫోర్నియా విశ్వవి ద్యాలయాల్లో సాగింది. హోస్టింగ్స్ ఆఫ్ లా గ్రాడ్యుయేషన్ చేసిన ఆమె 2010, 2014 లో కాలిఫోర్ని యా అటార్నీ జనరల్‌గా ఎంపికయ్యారు. 2016లో యూఎస్ సెనేట్ ఎన్నికల్లో తన ప్రత్యర్థి లోరెట్టా శాంచేజ్‌ని ఓడించి సెనేట్‌లో అడుగుపెట్టిన మొట్టమొదటి దక్షిణా సియా అమెరికన్‌గా రికార్డ్ సాధించారు. 2020 ఆగస్టు 11న జరిగిన ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి బైడెన్ అధ్యక్షుడుగా, కమ లాదేవి ఉపాధ్యక్ష అభ్యర్థ్దిగా విజయం సాధించారు. 2021 జనవరి 20న బాధ్యతలు స్వీకరించి యూఎస్ చరిత్రలో మొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు.

నల్ల జాతీయుల సంతతిగానే ..

కమలాదేవి హారీస్ తన ఉపాధ్యక్ష పద వీ కాలంలో ఇండో- భారత్ సంబంధాలపైగాని, అమెరికాలో ఉన్న ఇండియా ఎన్ ఆర్‌ఐల సంక్షేమం, వీసాల సరళీరకృతం లో గాని అసలు అంతగా పట్టించుకోలేదని, పూర్తిగా బ్లాక్ సంతతిగానే వ్యవహ రించా రని ప్రవాస భారతీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక విధంగా ఆమె భారత సంతతికి చెందినప్పటికీ తన భర్త దేశమైన జమైకా ప్రజలపట్ల చూపిన సహాయం ఎక్కువ అని భారత్ ఎన్‌ఆర్‌ఐలు ఆరోపిస్తున్నారు.

అయితే, గత ఏడా ది జూన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ వాషింగ్టన్‌లో  పర్యటించినప్పుడు సమావేశమైన కమలాదేవి హారిస్ తన దివంగత తల్లి శ్యామలా గోపాలన్ పుట్టిన దేశంతో తనకున్న సంబంధాలను గురించి మాత్రం భావోద్వేగంతో మాట్లాడారు. చెన్నైలో సివిల్ సర్వెంట్‌గా ఉన్న తన తాత పీవీ గోపాలన్ చెన్నై బీచ్‌లో చేతులు కలుపుతూ ప్రజాస్వామ్యం అంటే ఏమిటో బాల్యంలో ఆమెకు నేర్పించిన అనుభవాన్ని మాత్రం అప్పుడు నరేంద్ర మోదీతో మననం చేసుకున్నారు తప్ప, అంతగా అమెరికా ప్రవాస భారతీయుల గురించిన ఊసే ఎత్తలేదట.

మోదీ - ట్రంప్ స్నేహబంధం

కాగా, మాజీ అధ్యక్షుడు డోనాల్ ట్రంప్ తన అధ్యక్ష పదవీ కాలంలో ప్రవాస భారతీయులపట్ల మెరుగైన చర్యలు, నిర్ణయాలు ఉండేవి. దీనికి కారణం ప్రధాని నరేంద్ర మోదీతో మంచి స్నేహ సంబంధాలు ఉండటమే. యుఎస్, -భారత్‌ల అనుబంధాన్ని సూచించేలా 2019 సెప్టెంబర్ 20న అమెరికాలోని హ్యూస్టన్, టెక్సాస్‌లో ఉన్న ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సమ్మిట్, మెగా ఈవెంట్ ‘మోదీ హౌడీ’కి 50 వేలమందికి పైగా ఇం డో అమెరికన్లు హాజరయ్యారు. ఈ రకంగా రెండు దేశాల ఐక్యత, సామరస్య భావం తెలియచెప్పటం ఇరు దేశాల ప్రజల్లో పదిలంగా నేటి కీ గుర్తుంది. 

అలాగే, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష హోదా లో తన కుటుంబంతోసహా 2020 ఫిబ్రవరి 24, 25 తేదీల్లో భారత పర్యటనకు వచ్చినప్పుడు గుజరాత్‌లోని అహ్మదాబాద్ మోటే రా స్టేడియం (ఇప్పుడు నరేంద్ర మోడీ స్టేడియంగా పేరు మారింది)లో లక్షా పాతిక వేలమంది ప్రజలమధ్య ట్రంప్ గౌరవార్థం నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం ‘నభూతో నభవిష్యతి’గా నిలిచిందని చెప్పాలి. అమెరికా లో జరిగిన ‘మోదీ హౌడీ’, భారత్‌లో జరిగిన ‘నమస్తే ట్రంప్’ మెగా ఈవెం ట్‌లతో ఇరుదేశాల ప్రజల్లో స్నేహబంధాలు, ఆప్యాయ తాను రాగాలు పెనవేసు కోవట మే కాక అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు, అమెరికన్లలో పరస్పర స్నేహాను రాగాలు, మిత్ర సంబంధాలు బాగా పెరిగాయి.

భారత్‌తో ఇంతటి స్నేహం అను బంధం, ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్‌కు వున్న స్నే హం వెరసి భారతీయ ప్రవాసులు ట్రంప్ విజయం పట్లే ఆసక్తి చూపుతున్నారు. కారణం, ట్రంప్ ఈసారి విజ యం సాధిస్తే ప్రవాస భారతీయులకు మరింత సంక్షేమ, ఉద్యోగ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మెరుగువుతాయని చెప్పటంలో సందేహం లేదనేది వారి భావన.

వ్యాసకర్త సెల్: 9491545699