calender_icon.png 20 November, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పందుల గుంపు స్వైరవిహారంతో వరిపంటకు నష్టం

20-11-2025 12:00:00 AM

ఆలేరు, నవంబర్ 19 (విజయ క్రాంతి):  ఆలేరు పట్టణంలోని కాటమయ్య బస్తీ ఊరు చివర ప్రాంతంలో పందుల గుంపు స్త్వ్రర విహారం చేసి కోయడానికి సిద్ధంగా ఉన్న వరి పంట పొలం నాశనం చేశాయి. నష్టపోయిన ప్రాంతాన్ని సీపీఐ(ఎం) నాయకులు వరి పంటలు పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎంఎ ఇక్బాల్, మోరిగాడి రమేష్ లు మాట్లాడుతూ, పట్టణంలోని కాటమయ్య బస్తీలో చిన్నం రాములు తనకున్న రెండు ఎకరాల భూమిలో ఒక ఎకరం చేతికి వచ్చిన వరి పంటను గత రెండు రోజుల్లో పందులు నామరూపాలు లేకుండా తినేశాయని తెలిపారు.

వరి పక్కనే ఉన్న పత్తి పంటను సైతం పందులు నాశనం చేశాయని, చిన్నం రాములు పొలంతో పాటు మోరిగాడి శ్రీను, జలంధర్, వల్లపురెడ్డి, సాయిరెడ్డి, మోరిగాడి బాలయ్య, ఘనగాని మల్లేష్, రాజబోయిన జలంధర్ లకు సంబంధించిన దాదాపు పది ఎకరాల వరి పంటను పందులు నాశనం చేసినట్టు వారు తెలిపారు. రైతులకు జరిగిన అన్యాయాన్ని స్థానిక తహసిల్దార్ ఆంజనేయులుకు విన్నవించి, వరి పొలం నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

బహిరంగ ప్రదేశంలో పందులను పెంచుతున్న వ్యక్తుల నుండి రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.  సీపీఐ(ఎం) నాయకులు వడ్డేమాన్ బాలరాజు, మొరిగాడి మహేష్,  మొరిగాడి బాలయ్య, కావడీ రామచంద్రయ్య, మొరిగాడి అంజయ్య, జలంధర్, రామచంద్రయ్య, మధు, అంజయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.