calender_icon.png 20 November, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

20-11-2025 12:00:00 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

సూర్యాపేట, నవంబర్ 19 (విజయక్రాంతి) : తల్లిదండ్రుల పోషణ సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశం మందిరంలో నిర్వహించిన అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం -2025 లో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో వయో వృద్దులకు సంబందించిన చట్టాలు, పథకాలు అమలుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ  చూపుతుందన్నారు.

పెన్షన్ కు సంబంధించిన అకౌంట్ లోని డబ్బులును సైబర్ నేరగాలు ఫోన్ చెసి ఓటీపీ ద్వారా డబ్బులు దొంగలిస్తున్నారని, సైబర్ మోసాల పట్ల సీనియర్ సిటిజన్స్ అప్రమత్తం గా ఉండాలని సూచించారు.

జిల్లాలో రూ.50 లక్షలతో ఓల్ ఏజ్ హోం త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.  జిల్లా అదనపు కలెక్టర్ కే సీతారామారావు, అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, డి డబ్ల్యూ ఓ నరసింహారావు, డి పి ఓ యాదగిరి, డిప్యుటీ డి ఎం హెచ్ ఓ చంద్ర శేఖర్, డి సి హెచ్ ఎస్ వెంకటేశ్వర్లు, సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ ఆర్.సీతారామయ్య, బోల్లు రాంబాబు ,విద్యాసాగర్, హమీద్ ఖాన్, క్రిష్ణ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.