29-01-2026 12:00:00 AM
ఆరుగురికి గాయాలు
మేడిపల్లిలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పిల్లర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం
అతివేగమే ప్రమాదానికి కారణం
మేడిపల్లి, జనవరి 28 (విజయక్రాంతి): మేడిపల్లిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా.. ఆరుగురికి గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. స్నేహితుడి ఇంటికి శుభాకార్యానికి వెళ్లి కారు లో తిరిగి వెళ్తుండగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి వరంగల్ హైవేపై ఈ ఘటన జరిగిం ది. వనపర్తి జిల్లాకు చెందిన 8 మంది విద్యార్థులు హైదరాబాద్‌లోని గీతం కాలేజీ, ఓయూ డిగ్రీ కాలేజీ, సిఎంఆర్ కాలేజీ, సిద్ధా ర్థ కాలేజీలలో బీటెక్ చదువుతున్నారు.
మౌలాలీలోని స్నేహితుడి ఇంటి వద్ద జరిగిన శుభాకార్యానికి నిఖిల్(22) కారులో బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో పోచారం స ద్భవన టౌన్‌షిప్‌లో ఉంటున్న స్నేహితులను దింపేందుకు 8 మంది కారులో బయలుదేరారు. మేడిపల్లిలోని ఉప్పల్ ఎలివే టెడ్ ఫ్లైఓవర్ పిల్లర్ నెంబర్ 97 వద్ద కారు అతివేగంగా వెళ్లడంతో అదుపుతప్పి పిల్లర్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో గీతం కాలేజ్ విద్యార్థి నిఖిల్ (22), ఓయూ డిగ్రీ కాలేజ్ విద్యార్థి సాయి వరుణ్ (23) అక్కడికక్కడే మృతి చెందారు. వెంకట్ (23), రాకేష్ (22)లకు తీవ్రగాయాలు అయ్యాయి. మరో నలు గురు విద్యార్థులు అభినవ్(22), యశ్వంత్ రెడ్డి(22), సాత్విక్(23), హర్షవర్ధన్ (22) స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడ్డ వా రు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.