29-01-2026 12:00:00 AM
అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టండి
రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుదిల్ల శ్రీధర్ బాబు
కాంగ్రెస్ పార్టీలో చేరిన అయిల రమేష్‌కు కండువా కప్పి ఆహ్వానించిన మంత్రులు
సుల్తానాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షే మం ప్రజలకు తెలియజేస్తూ మున్సిపల్ ఎ న్నికల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపించుకోవాలని, సుల్తానాబాద్, పెద్దపల్లి రెండు మున్సిపాలిటీల ను కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజ య రమణారావు నియోజకవర్గంలో చేస్తు న్న అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారని రా ష్ట్ర టూరిజం శాఖ మంత్రి , పెద్దపల్లి పార్లమెంటు మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు లు అన్నారు, బుధవారం సుల్తానాబాద్ పట్టణంలోని య శోద నరహరి ఫంక్షన్ హాల్ లో పెద్దపల్లి ని యోజకవర్గ మునిసిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు అధ్యక్షతన జరిగింది.
అంతకు ముం దు బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్ కాంగ్రెస్ పార్టీలో చేరగా మంత్రులు రమేష్ కు కండు వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు సంవత్సరాలలో పెద్దపల్లి నియోజకవర్గం లో 1000 కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయమన్నారు, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులకు గాను తమ వంతు సహకారం ఎప్పు డూ ఉంటుందన్నారు, ఏదైనా అభివృద్ధి ప నుల విషయంలో నిధుల మంజూరు కోసం సీఎంతో పాటు మాకు కలుస్తూ, ఎప్పటికీ ఫోన్ల ద్వారా గుర్తు చేస్తూ పని అయి పో యేంతవరకు వదిలిపెట్టడన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్లు రాని వారు కూడా నిరాశ చెందవద్దని, ఎమ్మెల్యే సమయ అనుకూలంగా వారికి ఏదో విధం గా పదవులు ఇవ్వడానికి కృషి చేస్తారని అన్నారు, ప్రజలు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపించండి మరింత అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.... పెద్దపల్లి ఎమ్మెల్యే చింత కుంట విజయ రమణారావు మాట్లాడు తూ పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమానికి నిరంతరం కృషి చేయడం జరుగు తుందన్నారు, గతంలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు, ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మాజీ సర్పంచ్ అంతటి పుష్పలత దంపతులు మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుదిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు లను ఘనంగా సన్మానించారు... ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్ర తినిధులు, మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.