26-08-2025 02:30:24 AM
-కలగానే దోమకొండ 50 పడకల ఆసుపత్రి
-రూ.22 కోట్ల నిధులు మంజూరు
-నేటికి పూర్తి కాని భూసేకరణ ఇప్పటికే రెండుసార్లు టెండర్లు రద్దు
కామారెడ్డి, ఆగస్టు 25, (విజయక్రాంతి) , నిధులు మంజూరు కాక అభివృద్ధి పనులు జరగని సందర్భాలు ఉన్నాయి. కాని ఇందుకు విరుద్ధంగా కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంకు 50 పడ కల ఆసుపత్రి మంజూరైన.. అది కాగితాలకే పరిమితమైంది. స్థల నిర్ణయంలో జాప్యం జరుగుతుండడంతో భవన నిర్మాణానికి పునాదులు పడటం లేదు. దోమకొండకు పెద్ద ఆస్పత్రి వచ్చిందన్న కలలకు ముందడుగు పడక పోవడంతో స్థానికంగా ఉన్న ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
రెండుసార్లు టెండర్లు ప్రక్కన రద్దు
ఆసుపత్రి భవన నిర్మాణానికి ఆరు నెలల క్రితం రూ. 22 కోట్లు మంజూరయ్యాయి. భవనం, మార్చురీ, ప్రహరీ ,మెడికల్, గ్యాస్ పైప్లైన్ ,ఫైర్ సిస్టం, నీటి నిర్వహణ శానిటరీ ,అంతర్గత ఎలక్ట్రికల్ ,పనులకు గాను రూ. 14.69 కోట్లు మెడికల్ పరికరాలు, విద్యుత్ నియంత్రిక ఇతర పనులకు రూ. 7. 31 కోట్లు కేటాయించారు ఆయా పనులకు ఇప్పటికే రెండు సార్లు టెండర్ల ప్రకటన జారీ చేయగా స్థలం ఎంపిక సమస్యతోనే టెండర్లను రద్దు చేసినట్లు సమాచారం.
అనుకూలంగా లేని ప్రస్తుత భవనం
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి కోసం గత పంచాయతీ పాలకవర్గం గ్రామంలోని 1796 ,1797 సర్వే నెంబర్ల లోని నాలుగు ఎకరాల భూమిని శివరామా దేవాలయం కి సంబంధించినా దేవుని కుంట స్థలంను కేటాయించగా, 50 పడకల ఆసుపత్రిని ప్రభుత్వం మంజూరు చేసింది ప్రస్తుతం సొంత భవనంలో సామాజిక ఆరోగ్య కేంద్రం నిర్వహిస్తున్నారు.
ఈ ఆస్పత్రి 30 పడకల స్థాయిలో ఉంది 50 పడకల వైద్య సేవలు అందించడానికి ఈ భవనం అనుకూలంగా లేదు, భవనాల విస్తరణ ,ర్యాంపులు ,లిఫ్టు ఏర్పాటుకు స్థలం సరిపోదు కాబట్టి, గత పాలకవర్గం దోమకొండ మండల కేంద్రంలోని శివరామ మందిరానికి సంబంధించిన దేవుని కుంట స్థలం గ్రామం మధ్యలో ఉందని ప్రధాన రోడ్లకు దూరంగా ఉందని పరిశీలించిన అధికారులు బృందం నివేదించింది. మరోచోట ప్రభుత్వ స్థలం ఎక్కడ ఖాళీ లేదని రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పేశారు.
నెల రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దోమకొండ బోనాల ఉత్సవానికి వచ్చిన సందర్భంలో పెద్ద ఆస్పత్రికి సరిపడే ఖాళీ స్థలం మరొకచోట వెంటనే చూడాలని స్థానిక నాయకులకు సూచించారు. ఆసుపత్రి భవన నిర్మాణం జరిగితేనే భవిష్యత్తులో ఆసుపత్రి స్థాయి పెంపునకు అవకాశం ఉంటుందని తెలిపారు. కానీ ఇప్పటివరకు రోడ్డుకు దగ్గరలో ఎక్కడ ఖాళీ స్థలం ఎంపిక జరగలేదు.