26-08-2025 02:22:16 AM
-ఓడిపోతామని తెలిసి ఎన్నికల ఆలస్యం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
నిజామాబాద్ ఆగస్టు 25: (విజయ క్రాంతి) : కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయిందని ప్రజల్లో రాహుల్ గాంధీ మాటకు విలువ లేకుండా పోయిందని అందుకే ఓటు చోరీ అంటూ కొత్త డ్రామాకు తెరలేపారని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మే స్థితిలో లేరని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు యావత్ ప్రజానీకం మోదీ వెంటే ఉందని రామచంద్రరావు పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో సోమవారం నిర్వహించిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత పార్లమెంట్ ఎన్నికల్లోనే కాంగ్రెస్ ఓటమిపాల్ అయిందని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమనీ ఆయన అన్నారు.
భారతీయ జనతా పార్టీ మతపరమైన రిజర్వేషన్లకు దూరంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూ అందులో 10 శాతం ముస్లింలకు కేటాయించడం సిగ్గు చేతనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లవిపాల్ అవుతుందని ఈ విషయం వివిధ వర్గాల ద్వారా తెలుసుకునే ఎన్నికలంటే భయపడి ఆలస్యం చేస్తోందని రామచందర్రావు విమర్శించారు.
రాష్ట్రంలో అనేక పథకాల్లో కేంద్ర వాటా ఉందని విషయాన్ని ప్రతి ఇంటికి చేరేలా కార్యకర్తలు కృషి చేయాల ని పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మార్పు కావాలని ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారన్నారు. కొందరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బీజేపీ వైపు చూస్తున్నారని. త్వరలోనే రాష్ట్రంలో భారీ ఎత్తున బిజెపిలో చేరికలు ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పార్టీకి కార్యకర్తలే సంపద సంపదని పార్టీలో కొత్తవారికి అవకాశం ఉంటుందని పార్టీ క్యాడర్ కు ఆయన భరోసా ఇచ్చారు. యువత మహిళలు పెద్ద ఎత్తున చేరాలని రాం చందర్ రావు పిలుపునిచ్చారు. నిజామాబాద్ పార్లమెంటు అంటేనే బీజేపీకి తిరుగులేని స్థానమన్నారు. నాయకులు, కార్యకర్తల ఉత్సాహం వారి పట్టుదల ప్రజల ఆదరణ చూస్తే నిజామాబాద్ జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని బీజేపీ గెలుస్తుందన్న నమ్మకం కలుగుతోందన్నారు.
పార్టీకి కార్యకర్తలే సంపద అని అటువంటి సంపదను ఎంపీ ధర్మపురి అర్వింద్ పూర్తి గా వెన్నంటూ ఉండి అయినా తో పాటు జిల్లాలో పార్టీని పటిష్ట పరిచారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తూ పాలన కొనసాగిస్తుంద ని ఆయన విమర్శించారు. కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని రామచంద్ర రావు ఆరోపించారు. రాష్ట్ర నాయకత్వంలో జిల్లా వారికి చోటు కల్పించాలి. రాష్ట్ర నాయకత్వంలో తన పార్లమెంట్ పరిధిలోని కార్యకర్తలకు చోటు కల్పించాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. ఎక్కడైతే పార్టీకి బలం ఉంటుందో అక్కడ పదవులు కచ్చితంగా ఇవ్వాలన్నారు.
పార్టీని అభివృద్ధి చేసే బాధ్యత, కొత్తవారికి అవకాశం ఇచ్చే బాధ్యత రాష్ట్ర అధ్యక్షుడిదాని ఎంపీ అరవింద్ గుర్తు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేయాలని తామంతా వెన్నంటి ఉంటామని హామీ రామచంద్ర రావు కి అరవింద్ హామీ ఇచ్చారు ఇచ్చారు. ఇప్పటికీ రాష్ట్ర జిల్లా కమిటీల లో సీనియర్లకే పదవులు ఇస్తున్నారంటూ ఎంపీ అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొత్తవారికి అవకాశం కల్పించాల ని రాష్ట్ర అధ్యక్షుడిని ఆయన కోరారు.
పార్టీ ఎదుగుదలను అడ్డుకునే వారికి తాను ఎప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడతానని అరవింద్ ఆగ్రహంతో తెలిపారు. రాకేశ్ రెడ్డి బీజేపీ చేరేసమయంలో పార్టీలోని కొందరు పెద్దలు అడ్డుకున్నారని ఈ సందర్భంగా అరవింద్ గుర్తు చేశారు. ఆయనపై అనవసర పుకార్లు పుట్టించి అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆయన ఎండగట్టారు. ఈ విషయమై పార్టీ అధిష్టానం దృష్టి కీ తాను తీసుకెళ్లిబి రాకేశ్ రెడ్డి ని హీరో నేర్పించుకొని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామ హర్షద్వానుల మధ్య అరవింద్ తెలిపారు.
పుకార్లు సృష్టించిన నేతలే గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. ఇక మున్సిపల్, జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులను జిల్లా నుంచి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, నాయకులు లోక భూపతిరెడ్డి, పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాదగిరి, రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, నాగోల్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
చెక్కుల పంపిణీ..
ఎంపీ ధర్మపురి అర్వింద్ తన పుట్టినరోజును పురస్కరించుకొని పార్టీ కార్యకర్తలకు చెక్కులను పంపిణీ చేశారు. నూతన గృహప్రవేశాలు చేసిన వారికి, అనారోగ్యం పాలైన వారికి చెక్కులను అందజేశారు. అలాగే జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించారు.