calender_icon.png 30 January, 2026 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైకుపై కూలిన భారీవృక్షం.. వ్యక్తి మృతి

26-07-2024 12:05:00 AM

ములుగు (జయశంకర్ భూపాలపల్లి), జూలై 25 (విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం చిన్నబోయినపల్లి వద్ద రహదారిపై ఓ భారీ వృక్షం కూలిపోయింది. అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడిపై అది పడటంతో అక్కడిక్కడే మృతిచెందాడు. చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన జహంగీర్ బైక్‌పై గురువారం ఏటూరునాగారం వైపు వస్తుండగా ఒక్కసారిగా భారీ వృక్షం అతనిపై పడిపోయింది. ఈ ఘటనలో జహంగీర్ స్పాట్‌లోనే చనిపోయాడు. ఈ క్రమంలో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వృక్షాన్ని రోడ్డుపైనుంచి తొలగించారు.