calender_icon.png 30 January, 2026 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధే భారత్ లక్ష్యం

30-01-2026 12:00:00 AM

  1. ప్రజా సౌభాగ్యాలకే పథకాలు, నిర్ణయాలు
  2. ప్రధాని నరేంద్రమోదీ స్పష్టీకరణ
  3. ఐరోపా సమాఖ్యతో ఒప్పందం చారిత్రాత్మకం
  4. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ప్రశంసలు

న్యూఢిల్లీ  జనవరి 29: దేశ అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకుంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశా రు.  ప్రజల అభివృద్ధి సౌభాగ్యాలే లక్ష్యంగా పథకాలు, నిర్ణయాలు తీసుకుంటామని చెప్పా రు. ఆధునిక సాంకేతికతలో మార్పులకు అనుగుణంగా తామూ మారతామని చెప్పారు. అయితే, ప్రజలకు మేలు చేకూర్చే విధంగా త మ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటూ సాంకేతికతను జోడించి ముందుకు సాగుతామన్నారు.  ప్రజల స్థానాన్ని సాంకేతికత భర్తీ చేయజాలదని కూడా ప్రధాని స్పష్టం చేశారు.

ఐరోపా సమాఖ్యతో ... 

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో రోజైన గురువారం హాజరయ్యేందుకు వచ్చిన మోదీ అక్కడ మీడియాతో మాట్లాడుతూ, పలు కీలక వ్యాఖ్యలు చేశారు.  ‘భారతదేశం ప్రపంచ వేదికపై తనదైన ముద్రను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఐరోపా సమాఖ్య (ఈయూ)తో కుదుర్చుకోబోయే స్వేచ్ఛా వాణి జ్య ఒప్పందం (ఎప్టీఏ)కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదని, ఇది నవ భారత దేశపు ప్రతిష్టాత్మక లక్ష్యాలకు నిదర్శనం’ అని  పేర్కొన్నా రు. కొత్తగా తెరుచుకుంటున్న అంతర్జాతీయ మార్కెట్లను అందిపుచ్చుకోవాలని దేశీయ తయారీదారులకు పిలుపునిచ్చారు. 

రాష్ట్రపతి ప్రసంగంపై ప్రశంసలు 

ఇక పార్లమెంట్ సమావేశాల తొలి రోజున  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. అది కేవలం అధికారిక ప్రసంగం మాత్రమే కాదని, 140 కోట్ల భారతీయుల నమ్మకానికి, సామర్థ్యానికి ముఖ్యంగా యువత ఆకాంక్షలకు అద్దం పడుతోందని అన్నారు. దేశ భవిష్యత్తుపై రాష్ట్రపతి గీసిన ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ మాదిరిగా ఆ ప్రసంగం ఉందని  అభివర్ణించారు. 21వ శతాబ్దం రెండో క్వార్టర్‌కు తొలి బడ్జెట్ ఇది ఒక చారిత్రక ఘట్టమని, అలాగే 2047 వికసిత భారత్ లక్ష్యానికి కీలకమైన 25 ఏళ్ల ప్రారంభమన్నారు. వరుసగా 9వసారి మహిళగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని ప్రశంసించారు.

అంతర్జాతీయంగా పోటీ పడాలి

మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిణామాల నేపథ్యంలో భారత తయారీదారులు అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో పోటీ పడాలని ప్రధాని సూచించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే అవకాశాలను వినియో గించుకుని, భారత్‌లో తయారైన ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లను ఏలాలని ఆయన ఆకాంక్షించారు. ఈ బడ్జెట్ సమావేశాల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసే కీలక నిర్ణయాలు వెలువడనున్నాయని తెలిపారు.  

ప్రపంచానికి భారత్ ఆశాకిరణం

భారత్ నేడు ప్రపంచానికి ఆశాకిరణంగా, ఆకర్షణ కేంద్రంగా ఉందని, భారత్-ఈయూ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం యువతకు, పరిశ్రమలకు పెద్ద అవకాశమని ప్రధాని  పేర్కొన్నారు. దేశీ య తయారీదారులు నాణ్యతపై దృష్టి పెట్టాలని, 27 ఈయూ దేశాల మార్కెట్ల తలుపులు భారత్‌కు తెరుచుకున్నాయని తెలిపారు.  

పార్లమెంట్ సభ్యులు బాధ్యతగా మెలగాలి

బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటు సభ్యులకు (ఎంపీలు) రాష్ట్రపతి చేసిన సూచనలను ప్రధాని గుర్తు చేశారు. 2026 కొత్త ఏడాది ఆరంభంలో పార్లమెంటు సభ్యులంతా అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ఆశాభా వం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులంతా రాష్ట్రపతి వెలిబుచ్చిన అంచనాలను దృష్టి లో ఉంచుకుని, సభా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అర్థవంతమైన చర్చల్లో పాల్గొంటారని తాను నమ్ముతున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.