30-01-2026 01:31:38 AM
బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగిరేనా..?
బరిలోకి ఎమ్మెల్యే పీఏ సతీమణి
చైర్ పర్సన్ పీఠంపై కన్ను...
ఆశావహుల ఆశలు అవిరే..
బెల్లంపల్లి, జనవరి 29 : బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికలలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అవి ఆసక్తివే కావు పెను సంచలనైనవి. నామినేషన్ ఘట్టం ముం గిట కాంగ్రెస్ వ్యూహాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. ఎవరికీ అంతుపట్టని స్కెచ్ లు వెలుగులోకి వస్తున్నాయి. మునిసిపల్ ఎన్నికల తెరపైకి సంచలనమైన దృశ్యం ఆవిష్కృ తం కానున్నది. రిజర్వేషన్ల మార్పు ఎలా అందరిని ఖంగుతినిపించిందో.. సరిగ్గా ఎలాంటి షాకింగ్ వార్త పురపోరులో అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇది కొందరిలో ప్రధానంగా ప్రత్య ర్థి పార్టీలో దడ పుట్టిస్తోంది. అలాగే కాంగ్రెస్ అభ్యర్థుల్లో అందులోనూ చైర్ పర్సన్ పీఠo ఆశిస్తున్న వారి కూసాలు కదిలిస్తోంది.
ఇలాం టి పరిణామాలకు కారణమైన ఆ వ్యక్తి ఎవరంటారా..? ఆ సంచలన అంతుపట్టని వ్యూహ కర్త ఎవరోకాదూ.. మన ఎమ్మెల్యే గడ్డం వినో ద్, అతని ప్రధాన పర్సనల్ రాజకీయ వ్యూహకర్త గడ్డం ప్రసాద్. కాంగ్రెస్ పార్టీ అమ్ముల పొదిలో ప్రధాన అస్త్రం ఆయన సతీమణి గడ్డం భబిత ఈ సారి పురపోరులో దూకుతున్నారు. ఇది ముందుగా సొంతపార్టిలోలే కొందరికి షాకింగ్ దిమ్మదిరిగే వార్తే. మరికొందరిలో పెట్టుకున్న ఆశల సౌథాన్నీ కూల్చివేసే దే. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వ్యూహాలకు కొంద రు కాంగ్రెస్ లీడర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా రు. ఇదంతా తన ప్రధాన అనుచరుడు గడ్డం ప్రసాద్ రాజకీయ రంగ ప్రవేశానికి లైన్ క్లియ ర్ చేయడం కోసమే. కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్ పీఠాన్ని అధిరోహించడం కోసమే ఈ ఎత్తులు.
ఇప్పుడున్న అభ్యర్థుల్లో ప్రజల్ని ప్రభావితం చేసే వారు లేరూ. అందుకని ఎమ్మేల్యే గడ్డం వినోద్ ఇలాంటి అనూహ్యలు, చక్రాలు తిప్పుతున్నారు. ప్రత్యర్థి పార్టీ టీఆర్‌ఎస్ ను కుదేలు చేసే బలమైన గెలుపు గుర్రాన్నీ రంగంలోకి దించడం కామిటేషన్ పాలిటిక్స్‌లో ఈ మా త్రం వ్యూహాలు అవసరమే.. ఒక రిచ్ అభ్యర్థి అందులో ఎమ్మెల్యే గడ్డం వినోద్ కనుసన్నల్లో పాలన పగ్గాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మున్సిపాలిటీల్లోనీ 4 వార్డు, బెల్లంపల్లి బస్తీ నుంచి గడ్డం ప్రసాద్ సతీమణి భబితను బరిలోకి దించుతున్నారు.
గడ్డం ప్రసాద్ జన్మగడ్డ బెల్లంపల్లి బస్తీ కావడం రిజర్వేషన్ కలిసి వచ్చి ంది అక్కడనే. ఈ మేరకు నామినేషన్ దాఖలు వేసి పోటీలో ఉంటారు. 4 వార్డు నుంచి పోటీ చేయడం వల్ల బెల్లంపల్లి బస్తీ పుర చరిత్ర కెక్కనున్నది. ఇంతవరకు ఇలాంటి ప్రత్యేక చరీత్ర ఆ బస్తీకి లేదు. రాజకీయాల్లో కొత్త అధ్యయనంలోకి బెల్లంపల్లి బస్తీ ప్రముఖ స్థానం చోటు చేసుకోవడంతో అభివృద్ధి విషయంలో పూర్వ పరిస్థితి కి భిన్నంగా ఉంటుందని వాసులు భావిస్తున్నారు. అభివృద్ధిలో ఈ రకంగా నైనా వెనుకబడిన బెల్లంపల్లి బస్తికి మహర్దశ పట్టాలని ప్రజలు ఆశిస్తున్నారు.
ప్రజలు ఆదరిస్తారా?
బెల్లంపల్లి పుర పోరులో తెరపైకి వస్తున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రధాన అనుచరుడు గడ్డం ప్రసాద్ సతీమణి భబితను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేదానిపై చర్చ జరుగుతుంది. హైదరాబాదులో స్థిరపడిన ప్రసాద్ దంపతులు స్టానీకేతర బస్తీ వాసులతో కొంత గ్యాప్ ఏర్పడింది. ప్రసాద్ తల్లి, తమ్ముడు ఇక్క డే ఉన్నప్పటికీ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కొంతమేరకు ఆయనకు దూరం అయ్యాయి. అయితే తల్లి, సోదరడు కుటుంబంతో బస్తీ వాసులతో ఉన్న ఈ లోటు తీరుతుందనే భరోసా మాత్రం ఉన్నది. అంతే కాకుండా అంగ, అర్ధ బలం స్వల్పకాలిక లోటుపాట్లను పూరీస్తుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశిస్తున్న సీనియర్ నాయకులు సైతం రెబల్ గా రంగంలోకి దిగే అవకాశం ఉన్నది. ఈ రకంగా కూడా కొంత ప్రతికూల పరిస్థితులు సవాలు గా తలెత్తునున్నాయి. బారాస నుంచి పోటీ కూడా బలంగానే ఉంటది.
ఇంటాబయట పోరు బలంగా ఎదురవుతుంది. ఈ పరిస్థితిని అధిగమించడంపై గడ్డం భబిత విజయవకాశాలు ఉంటాయని పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలత కలిసి వస్తోంది. ప్రభుత్వ పథకాలు సానుభూతిపైనే భారం వేసుకొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఆదరణ, సానుకూల అభిమాన గాలి ప్రజలపై తీవ్రంగా ఉంది. అధికార పార్టీ తరుపున గెలిచే అభ్యర్థి వల్లనే తమకు మేలు జరుగుతుందని వార్డు వాసులు అభిప్రాయాలు లేకపోలేదు. ఓటరు తన తీర్పులో ఇలా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం అధికార పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉంటాయని అభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి గా బరిలోకి వచ్చే గడ్డం భబిత పట్ల ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.