calender_icon.png 25 October, 2025 | 2:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగాళాఖాతంలో అల్పపీడనం

25-10-2025 01:12:16 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడింది. శనివారం నాటికి అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుందని, దీంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆదివారం నుంచి మూడురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శుక్రవారం ప్రకటించింది. పశ్చిమ కను మల ప్రాంతాలైన రాణిపేట్, వెల్లూరు వంటి ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

చెన్నై నగరంతోపాటు తిరుచ్చి, తంజావూరు, కృష్ణగిరి, కన్యాకుమారి జిల్లాల్లోనూ అల్పపీడన ప్రభావం ఉంటుందని పేర్కొంది. అలాగే అల్పపీడనం కారణంగా తెలంగాణకూ వర్ష సూచన ఉందని ప్రకటించింది. ఈనెల 27 తేదీ కల్లా వాయుగుండం తుఫాన్ గా మారే అవకాశం ఉందని, ఫలితంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.