22-04-2025 12:51:41 AM
రాజీవ్ యువ వికాసం పథకంపై కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సమీక్ష
దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా నిర్వహించాలి
మే 15వ తేదీ వరకు సర్వే ప్రక్రియ పూర్తి చేయాలి
జనాభా ప్రాతిపదికన యూనిట్ల కేటాయింపు
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయుతను అందించి స్వయం ఉపాధి కల్పిం చే దిశగా ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హుల జాబితా రూపొందించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్ రావు, డిఆర్‌డి ఓ దత్తారావులతో కలిసి రాజీవ్ యువ వికా సం పథకంలో అర్హులైన షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, అల్ప సంఖ్యాక వర్గాలు, ఇతర వెనుకబడిన తరగతుల అభ్యర్థుల నుండి అందిన దరఖాస్తుల పరిశీలన మార్గదర్శకాలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, బ్యాంకుల మేనేజర్లు, ఎ. పి. ఎం.లు, కార్పొరేషన్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాజీ వ్ యువ వికాసం పథకంలో అందిన దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా నిర్వహించి అర్హులైన వారి జాబితా రూపొందించే విధంగా చర్య లు తీసుకోవాలని తెలిపారు. మండల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, బ్యాంకుల మేనేజర్లు, కమిటీ సభ్యులు తమ మండలంలో కార్యచరణ రూపొందించుకున ప్రతి దరఖాస్తును పరిశీలించి అర్హులైన వారి జాబితా రూపొందించాలని తెలిపారు.
మే 15వ తేదీ వరకు సర్వే ప్రక్రియ పూర్తి చేసి జిల్లా స్థాయి కమిటీకి జాబితా అందించాలని, బ్యాంకర్ల సమన్వయంతో పని చేయాలని తెలిపారు. దరఖా స్తుల పరిశీలన సమయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు/ ఆదా య ధ్రువీకరణ పత్రం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పొందిన కుల దృవీకరణ పత్రం, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాసుపుస్తకం, సదరం సర్టిఫికెట్, ఇతర ధ్రువపత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని తెలిపారు. జనాభా ప్రాతిపదికన యూనిట్ల కేటాయిం పు ఉంటుందని, ఓకే గ్రామంలో ఒక్కటి యూనిట్‌కు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించాలని, ఆయా కార్పొరేషన్ల అధికారులు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో పాల్గొనాలని తెలిపారు.
మండల కమిటీ నుండి జాబితా వచ్చిన అనంతరం మే 21 నుండి 30వ తేదీ వరకు జిల్లాస్థాయి కమిటీ పరిశీలన తరువాత అర్హులైన వారికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన మంజూరు పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమం లో జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి సజీవన్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజేశ్వరి జోషి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.