13-05-2025 01:31:33 AM
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి ప్రారంభం
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): మహావీర్ గ్రూప్‌లో భాగమైన ప్రముఖ స్కోడా డీలర్షిప్ అయిన మహావీర్ స్కోడా తెలంగాణ, ఏపీలోని తన షోరూమ్‌లలో సరికొత్త స్కోడా కోడియాక్ కార్లను కస్టమర్ డెలివరీలను ప్రారంభించింది.
రెండవ తరం కోడియాక్ శక్తివంతమైన 2.0 టీఎస్‌ఐ ఇంజిన్ (204 పీఎస్, 320ఎన్‌ఎం), 7 డీఎస్‌జీ, 4x4 సామర్థ్యం, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్‌ఏఐ) -రేటెడ్ మైలేజ్ 14.86 కి.మీ./లీ.తో లగ్జరీ, పనితీరు మరియు బహుముఖ ప్రజ్ఞను మిళితం చేస్తుంది.
32.77-సెం.మీ.ల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్మార్ట్ డయల్స్, ఎర్గో మసాజ్ సీట్లు, కాంటన్ 13 -స్పీకర్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్రూఫ్, 9 ఎయిర్‌బ్యాగ్‌లు, 1,976 లీటర్ల వరకు లగేజ్ స్పేస్ వంటి ముఖ్యాంశాలు ఉన్నాయి.
దీని ధర రూ.46.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభవుతుంది. 5 సంవత్సరాలకు, 125వేల కి.మీ.ల వారంటీ, 10 సంవత్సరాల రోడ్-సైడ్ అసిస్టెన్స్, ఉచిత మొదటి సంవత్సరం స్కోడా సూపర్కేర్ ప్యాకేజీతో వస్తుంది. మహావీర్ స్కోడా షోరూమ్‌లలో టెస్ట్ డ్రైవ్‌లు, బుకింగ్స్ తెరవబడ్డాయి.