calender_icon.png 13 May, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈటల ఇంటి ముట్టడికి యత్నం

13-05-2025 01:32:34 AM

- యూత్ కాంగ్రెస్ నేతల అరెస్టు

- ఈటల నివాసం వద్ద భారీగా బీజేపీ కార్యకర్తలు

మేడ్చల్, మే 12 (విజయక్రాంతి): మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ పిలుపునివ్వడంతో మేడ్చల్ మండలం పూడూరు శివారులోని ఈటల ఇంటికి సోమవారం ఉదయం బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈటల ఇంటి ముట్టడికి వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు 50 మందిని పోలీసులు షామీర్‌పేట వద్ద అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఈటల రాజేందర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఇటీవల బాచుపల్లిలో అపార్ట్‌మెంట్‌వాసులకు నోటీసులు ఇవ్వడంతో వారు ఈటల రాజేం దర్‌ను ఆశ్రయించారు. ఆయన అండగా ఉంటానని హామీ ఇవ్వడంతోపాటు రేవంత్‌రెడ్డి సైకోల వ్యవహరిస్తున్నారని విమర్శిం చారు. దీనికి నిరసనగా యూత్ కాంగ్రెస్ ఈటల ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఈటల ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఎవరు చెప్పినా వినని వారు సైకోనే: ఎంపీ ఈటల రాజేందర్

ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నప్పుడు ఎవరు చెప్పినా వినని వారిని నాయకుడు అనరని, సైకోనే అంటారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తన ఇంటికి చేరుకున్న బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రజల ఇళ్లను ధ్వంసం చేసి, వారు ఏడుస్తుంటే, ఆత్మహత్యలు చేసుకుంటుంటే చూసి నవ్వే వారిని సైకో అంటా రన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఇళ్లను హైడ్రా పేరుతో కూల్చుడే, అడ్డొచ్చిన వారిని తొక్కు డే అన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. అమాయక ప్రజలను భయభ్రాంతు లకు గురి చేస్తున్నారని, కంటిమీద కునుకు లేకుండా, సరిగా అన్నం తినకుండా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రియల్‌ఎస్టేట్ పడిపో వడానికి సీఎం రేవంత్‌రెడ్డే కారణమన్నారు. ఒకప్పుడు లేక్ వ్యూ అంటే మంచి ధర పలికేదని, ప్రస్తుతం కొనడానికే భయపడు తున్నారని ఈటల రాజేందర్ చెప్పారు.