calender_icon.png 13 May, 2025 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం భేటీ

13-05-2025 01:34:24 AM

- పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

- సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో తీసుకున్న భద్రతా చర్యలపై వివరణ

- ఆర్‌టీఐ కమిషనర్ల నియామకంపై చర్చ!

హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర గవ ర్నర్ జిష్ణుదేవ్‌వర్మతో రాజ్‌భవన్‌లో సోమవారం భేటీ అయ్యారు. భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులు, అందుకనుగుణం గా తెలంగాణ ప్రభుత్వం భద్రత విషయంలో  తీసుకున్న చర్యలను గవర్నర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్‌కు వివరించారు.

దీంతోపాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై సైతం ఈ సమావేశంలో చర్చిం చినట్టు తెలిసింది. అలాగే సమాచార కమిషనర్ల నియామకంపై కూడా గవర్నర్‌తో చర్చించినట్టు సమాచారం. గవర్నర్‌తో భేటీ అయిన తర్వాతే నూతన ఆర్‌టీఐ కమిషనర్లుగా నలుగురిని నియమిస్తూ రాష్ట్ర ప్రభు త్వం జాబితాను విడుదల చేయడం గమనార్హం.

సమాచార కమిషనర్లకు సంబంధిం చిన ఫైల్ కొద్దికాలం క్రితమే సర్కార్ రాజ్‌భవన్‌కు పంపింది. అయితే దానిపై గవర్నర్ ఇప్పటివరకూ ఆమోదం తెలపకపోవడంతో ఈ అంశంపై గవర్నర్‌తో సీఎం చర్చించినట్టు సమాచారం. గవర్నర్‌తో భేటీ అనంతరం సమాచార కమిషనర్లను నియమిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది.